News April 27, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News February 16, 2026
చౌటకూర్: ముగిసిన ఉమ్మడి మెదక్ జిల్లా స్థాయి ఖోఖో క్రీడలు

చౌటకూర్‌లో రెండు రోజులుగా జరుగుతున్న ఉమ్మడి మెదక్ జిల్లా స్థాయి ఖోఖో సీజన్-3 క్రీడోత్సవాలు ఆదివారం ముగిశాయి. ఖోఖో అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ క్రీడల్లో ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి జట్లు తరలి వచ్చాయి. రెండవ రోజున ఫైనల్ పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచులు పార్కల రాంరెడ్డి, గొల్ల మల్లేశం, కలాలి రామాగౌడ్, ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.
News February 16, 2026
ఏలూరు PGRSకు ఇలా ఫిర్యాదు చేయొచ్చు..!

జిల్లా వ్యాప్తంగా సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు ఏలూరు కలెక్టర్ వెట్రి సెల్వి ఆదివారం తెలిపారు. PGRSకు రాలేని వారు https://meekosam.ap.gov.in వెబ్సైట్‌లో ఫిర్యాదును నమోదు చేయొచ్చని సూచించారు. ఫిర్యాదుల స్థితి తెలుసుకోవడానికి టోల్ ఫ్రీ నంబరు 1100 ఫోన్ చేయాలన్నారు. సమయానుకూలంగా సమస్యలు పరిష్కారం అవుతాయని స్పష్టం చేశారు.
News February 16, 2026
PGRSకు వారిని తీసుకురావద్దు: బాపట్ల కలెక్టర్

నడవలేని స్థితిలో ఉండి మంచాలకు పరిమితమైన అనారోగ్య బాధితులను PGRSకు తీసుకురావద్దని కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ ఆదివారం తెలిపారు. వారి తరఫున కుటుంబ సభ్యులు అర్జీలు అందజేయవచ్చని సూచించారు. ప్రతి సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు అర్జీలు స్వీకరిస్తామన్నారు. ద్విచక్ర వాహనాలపై వచ్చే వారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు.


