News April 27, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News February 7, 2026
జర్నలిస్టుల అక్రిడిటేషన్లకు దరఖాస్తుల ఆహ్వానం

జిల్లాలో 2026-28 సంవత్సరానికి గానూ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల జారీకి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ జితేష్ వి.పాటిల్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న కార్డుల గడువు ఫిబ్రవరి 28తో ముగియనుందని, ఈ నేపథ్యంలో అర్హత కలిగిన జర్నలిస్టులు కొత్త కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సమాచార పౌరసంబంధాల శాఖ నిబంధనల మేరకు పారదర్శకతతో ఈ ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు.
News February 7, 2026
CTR: మార్చి నుంచి HANUMAN ప్రాజెక్ట్ ప్రారంభం..!

ఉమ్మడి జిల్లాలో పెరుగుతున్న మానవ–వన్యప్రాణుల ఘర్షణలను తగ్గించేందుకు GOVT మార్చి నుంచి హనుమాన్ ప్రాజెక్ట్ అమలుకు సన్నాహాలు చేస్తోంది. ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లు, మొబైల్ వైల్డ్‌లైఫ్ అంబులెన్స్‌లు, ప్రాంతీయ వన్యప్రాణి రక్షణ-చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఆధునిక సాంకేతికతతో వన్యప్రాణుల కదలికలపై నిఘా, తక్షణ సహాయం, వేగవంతమైన నష్టపరిహారం, ప్రజల ప్రాణాలు కాపడటమే లక్ష్యంతో ఈ పథకం రూపొందించారు.
News February 7, 2026
ఎన్నికల కౌంటింగ్ పాసుల కోసం దరఖాస్తు చేసుకోండి: కలెక్టర్

ఈనెల 11న మున్సిపల్ ఎన్నికలు, 13న కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో అక్రెడిటేషన్ కలిగిన విలేకరులు పాస్‌ల కోసం దరఖాస్తు చేసుకోవాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. ఈనెల 9న నస్పూర్ కలెక్టరేట్‌లోని G4 గదిలో దరఖాస్తులు సమర్పించాలన్నారు. పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో, ఒరిజినల్ అక్రెడిటేషన్ కార్డు వెంట తెచ్చుకోవాలని సూచించారు. పాస్‌లు ఉన్నవారిని మాత్రమే ఎన్నికల కేంద్రాల్లోకి అనుమతిస్తామని స్పష్టం చేశారు.


