News April 27, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News February 17, 2026

అమలాపురం: చదరంగంలో మీ సత్తా చూపండి

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ‘షాప్ లీగ్’ చదరంగం పోటీలను కలెక్టర్ మహేశ్ కుమార్ మంగళవారం ప్రారంభించారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం జిల్లా నుంచి రాష్ట్రస్థాయి వరకు మల్టీ స్పోర్ట్స్ లీగ్ నిర్వహిస్తోందని తెలిపారు. 12 నుంచి 20 ఏళ్ల వయసున్న క్రీడాకారులకు ఈ పోటీలు జరుగుతున్నాయి. ప్రతిభావంతులైన యువతను వెలికితీయడమే లక్ష్యమని కలెక్టరేట్ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ పేర్కొన్నారు.

News February 17, 2026

నెల్లూరు మేయర్‌గా మరోసారి మహిళకే ఛాన్స్!

image

నెల్లూరు మేయర్‌గా 53వ డివిజన్ కార్పొరేటర్ దేవరకొండ సుజాత పేరు వినబడుతుంది. మాజీ మేయర్ స్రవంతిని అవిశ్వాసం పెట్టి దించిన తర్వాత.. అదే సామాజిక వర్గానికి చెందిన ఈమెను TDP తెరమీదకు తెచ్చినట్లు తెలుస్తోంది. ఎస్టీ జనరల్‌కు కేటాయించినా.. మహిళకే ప్రాధాన్యం ఇస్తే ఈమె ముందు వరుసలో ఉంది. TDP తరఫున 47 మంది, YCP నుంచి ఏడుగురు మాత్రమే కార్పొరేటర్లు ఉన్నారు. వీరు 26న జరిగే సమావేశంలో మేయర్‌ను ఎన్నుకోనున్నారు.

News February 17, 2026

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి స్పాట్ డెడ్

image

నాదెండ్ల – గణపవరం మధ్య నూతన హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. వేగంగా వెళ్తున్న బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో, వాహనదారుడు ఎగిరి కిందపడి తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు హెల్మెట్ ధరించకపోవడమే మరణానికి ప్రధాన కారణమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హెల్మెట్ ఉండి ఉంటే ప్రాణాలు దక్కేవన్నారు.