News April 27, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News February 13, 2026
విశాఖలో సహజీవనం.. ప్రియుడిని చంపిన ప్రియురాలు

ఆనందపురం శివారు పందుల ఫారంలో జరిగిన <<19116438>>హత్య<<>> కేసులో నిందితురాలు షేక్ ముబీనా అలియాస్ శ్రావణి (41)కి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. రాజమహేంద్రవరానికి చెందిన నాగశివ (36)తో ఆమె సహజీవనం సాగిస్తోంది. ఆవు అమ్మకం డబ్బుల విషయంలో గొడవ, వ్యక్తిగత విభేదాల నేపథ్యంలో అతడిపై కత్తితో దాడి చేయగా మృతి చెందాడు. జాగిలాల సాయంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని జైలుకు తరలించారు.
News February 13, 2026
కల్వకుర్తి: తాగిన మైకంలో ఆరేళ్ల చిన్నారిపై లైంగిక వేధింపులు

కల్వకుర్తి పట్టణంలోని డబుల్ బెడ్రూమ్ కాలనీలో దారుణం జరిగింది. మద్యం మత్తులో రాజు అనే వ్యక్తి ఆరేళ్ల బాలికను ఇంటిపైకి తీసుకెళ్లి లైంగిక దాడికి ప్రయత్నించాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
News February 13, 2026
భగ్గుమంటున్న ధరలు

దేశంలో ధరల పెరుగుదల కొనసాగుతోంది. JANలో రిటైల్ ద్రవ్యోల్బణం 2.75%గా నమోదైంది. రాష్ట్రాల వారీగా TGలో అత్యధికంగా 4.92%గా ఉంటే 2.83%తో AP ఐదో స్థానంలో ఉంది. తొలిసారిగా కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్(CPI) ఆధారంగా ప్రభుత్వం గణాంకాలు విడుదల చేసింది. 308 వస్తువులు, 50 సేవల ధరలను పరిగణనలోకి తీసుకుంది. వెండి, టమాటా, కొబ్బరి, బంగారం గరిష్ఠ ద్రవ్యోల్బణంలో, ఉల్లి, ఆలుగడ్డ, కందిపప్పు తక్కువ ద్రవ్యోల్బణంలో ఉన్నాయి.


