News April 27, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News February 17, 2026

JGTL: కాంగ్రెస్‌లో ‘జీవన్’ సెగ.. పార్టీ మార్పు తప్పదా?

image

కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి కొన్నినెలలుగా అవకాశం దొరికినప్పుడల్లా అధిష్ఠానంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూనే ఉన్నారు. దీనిపై పార్టీ బడానేతలు ఏమీ పట్టనట్టు ఉన్నా ఇటీవల పార్టీకి వ్యతిరేకంగా రెబల్స్ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొనడం హైకమాండ్‌కి మరింత కోపాన్ని తెప్పించింది. ఎన్ని చెసినా MLA సంజయ్‌కే పార్టీ అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో రగిలిపోతున్న జీవన్ రెడ్డి పార్టీ మార్పు తప్పదనే సంకేతాలు ఇస్తున్నారు.

News February 17, 2026

పాలమూరు: కాంగ్రెస్ ఖాతాలోకి 17 ఛైర్మన్, 1 మేయర్

image

ఉమ్మడి పాలమూరు మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఛైర్మన్/ మేయర్, వైస్ ఛైర్మన్/ డిప్యూటీ మేయర్ ఎన్నికల ఫలితాలను ఎన్నికల సంఘం (SEC) అధికారికంగా ప్రకటించింది. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ (INC) 17 ఛైర్మన్, 1 మేయర్ స్థానాలను కైవసం చేసుకుంది. BRS 2 మున్సిపల్ ఛైర్మన్ స్థానాలు సాధించింది. BJP, AIFB(ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్)లకు చెరొకటి ఛైర్మన్ స్థానాలు దక్కాయి.

News February 17, 2026

₹34,855 కోట్లు.. సైబర్ నేరగాళ్లు దోచుకున్న డబ్బు ఇది!

image

దేశంలో సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇప్పటిదాకా ఆన్‌లైన్ ఫ్రాడ్‌తో నేరగాళ్లు కొట్టేసిన డబ్బు ₹34,855 కోట్లు ఉంటుందని ఈడీ గుర్తించింది. అందులో ₹12,230 కోట్లను అటాచ్ చేసినట్లు అధికారులు తెలిపారు. సైబర్ నేరాలపై నమోదైన 234 కేసులను దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ఆన్‌లైన్ గేమింగ్, క్రిప్టో కరెన్సీ, లోన్ యాప్స్, ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్లు, డిజిటల్ అరెస్టులతో దోచుకుంటున్నట్లు వెల్లడించారు.