News April 27, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News February 10, 2026

రాజమండ్రి: శివరాత్రి ఉత్సవాలు.. వాటికి అనుమతి తప్పనిసరి

image

మహాశివరాత్రి పర్వదినం రోజున ప్రధాన, ఇతర రహదారులపై అన్నదాన కార్యక్రమాల కోసం దాతలు ఏర్పాటు చేసే టెంట్లకు ముందస్తుగా పోలీస్ శాఖ నుండి అనుమతి తప్పనిసరి అని కమిషనర్ రాహుల్ మీనా ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అన్న సంతర్పణ కేంద్రాలను మ్యాప్‌లో సూచించిన ప్రాంతాల్లోనే ఏర్పాటు చేయాలన్నారు. భోజనం కోసం ఉపయోగించిన ప్లేట్లు, గ్లాసులు, ఇతర వ్యర్థాలను కచ్చితంగా డస్ట్‌ బిన్‌‌లలోనే వేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.

News February 10, 2026

NZB: 488 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు: కలెక్టర్

image

నిజామాబాద్ జిల్లాలో నగర పాలక సంస్థ పరిధిలోని 60 డివిజన్లలో ఎన్నికల కోసం 488 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేసినట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. మంగళవారం మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. మొత్తం 3,48,116 మంది ఓటర్లు ఉన్నారని వెల్లడించారు. ప్రజలు ప్రశాంతంగా, స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, భద్రతా చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు.

News February 10, 2026

NGKL: యాప్ ద్వారా విజయవంతంగా యూరియా పంపిణీ: కలెక్టర్

image

నాగర్ కర్నూల్ జిల్లాలో యాప్ ద్వారా 25 వేల మంది రైతులకు 1.23 లక్షల యూరియా బస్తాలను విజయవంతంగా పంపిణీ చేసినట్లు కలెక్టర్ సంతోష్ తెలిపారు. ఈ యాసంగిలో ఇప్పటివరకు మొత్తం 6.65 లక్షల బస్తాలు అందజేశామన్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి మొక్కజొన్న సాగు 60 శాతం పెరిగిందని ఆయన పేర్కొన్నారు.