News April 25, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News March 9, 2026

అనకాపల్లి: గుండెపోటుతో యువకుడు మృతి

image

గొలుగొండ మండలం పుత్తడి గైరంపేట గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఎం. శ్రీను(27) గుండెపోటుతో మృతిచెందాడు. సోమవారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో గుండెపోటు రాగా ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షలు నిర్వహించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. శ్రీను నర్సీపట్నంలో నూడుల్స్ వ్యాపారం నిర్వహిస్తున్నట్లు గ్రామస్థులు తెలిపారు.

News March 9, 2026

సంగారెడ్డి: ‘ఫార్మర్ రిజిస్ట్రేషన్ నమోదు చేసుకోవాలి’

image

రైతులందరూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శివప్రసాద్ సోమవారం తెలిపారు. పట్టా పాస్ పుస్తకం ఆధార్ కార్డు తీసుకొని మండల వ్యవసాయ శాఖ అధికారుల వద్దకు వెళ్తే ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేస్తారని చెప్పారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులకు మాత్రమే కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయని పేర్కొన్నారు.

News March 9, 2026

చమురు భగభగ.. 120 డాలర్లకు చేరిన బ్యారెల్!

image

మిడిల్ ఈస్ట్‌లో టెన్షన్స్‌‌తో క్రూడ్ ఆయిల్ ధర ఒక్క రోజులో 29% పెరిగింది. రష్యా-ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో 2022లో చివరగా ఈ రేంజ్ హైక్ నమోదైంది. UAE ముర్బాన్ క్రూడ్ బ్యారెల్ (159L) ధర $120కు, వెస్ట్ టెక్సాస్ $115, బ్రెంట్ క్రూడ్ $116కు చేరాయి. ఇరాక్, కువైట్, UAEలో చమురు ఉత్పత్తి తగ్గడంతో ధరలకు రెక్కలొచ్చాయి. ఇరాక్‌లో రోజుకు 4.3M బ్యారెల్స్‌గా ఉండే ఉత్పత్తి 1.8 మిలియన్లకు పడిపోయింది.