News April 27, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News February 11, 2026

వనపర్తి: ఓటేసిన 102 ఏళ్ల బామ్మ..!

image

వనపర్తి జిల్లా అమరచింత మున్సిపాలిటీ కేంద్రంలోని ఎనిమిదో వార్డులో 102 ఏళ్ల వృద్ధురాలు జహీరాబీ బుధవారం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తనకు 102 సంవత్సరాలు నిండాయని, మొదట వేసిన ఓటు గుర్తులేదని జహీరాబీ చెప్పారు. ఆమె ఓటేసేందుకు ఎస్ఐలు స్వాతి, శివకుమార్ సహకరించారు. ఎస్ఐలు మాట్లాడుతూ.. జహీరాబీని అందరూ ఆదర్శంగా తీసుకుని ఓటేసేందుకు యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

News February 11, 2026

భీమవరంలో డయాలసిస్ కష్టాలు.. జిల్లా కేంద్రంలోనే లేని వైద్య సేవలు!

image

జిల్లా కేంద్రం భీమవరంలో డయాలసిస్ కేంద్రం లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఉన్న సెంటర్‌ను తొలగించడంతో చికిత్స కోసం పాలకొల్లు, ఆకివీడు వెళ్లాల్సి వస్తోంది. దూర ప్రయాణం భారమై ప్రాణాపాయ స్థితిని ఎదుర్కొంటున్నామని, వెంటనే పట్టణంలో తాత్కాలిక డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి తమను ఆదుకోవాలని బాధితులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

News February 11, 2026

రంగారెడ్డి 6 మున్సిపాలిటీల్లో ప్రశాంతంగా పోలింగ్

image

రంగారెడ్డి జిల్లాలోని 6 మున్సిపాలిటీలలో పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ఆమనగల్ మున్సిపాలిటీలో 11.44%, చేవెళ్లలో 11.54%, ఇబ్రహీంపట్నంలో 13.12%, మొయినాబాద్‌లో 12.41%, శంకర్‌పల్లిలో 9.26%, షాద్‌నగర్‌లో 11.84% నమోదయింది. ఈ లెక్కలను బట్టీ నెమ్మదిగా సాగుతున్నట్లు తెలుస్తోంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఓటింగ్ సరళిని కలెక్టర్ నారాయణరెడ్డి పర్యవేక్షిస్తున్నారు.