News April 27, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News February 18, 2026

సంగారెడ్డి: ఓటర్ల సర్వేలో వేగం పెంచాలి: కలెక్టర్

image

సంగారెడ్డి జిల్లాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR) ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులను కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటివరకు 51.96 శాతం సర్వే మాత్రమే పూర్తయిందని, ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో పురోగతి తక్కువగా ఉందన్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్ల జాబితా సవరణను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.

News February 18, 2026

పేద మహిళల కోసం ఆర్థిక ప్రోత్సాహం: కలెక్టర్

image

పేద మహిళల అభ్యున్నతి కోసం ప్రభుత్వం ఆర్థిక ప్రోత్సాహం అందిస్తుందని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. శ్రీనిధి క్రెడిట్ కో-ఆపరేటివ్ ఫెడరేషన్ పని తీరు, ఆర్థిక ప్రణాళికలు బ్యాంకు లింకేజీ రుణాలపై కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రెడిట్ ప్లాన్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని, వేగవంతంగా లోన్ రికవరీ చేయాలని సూచించారు.

News February 18, 2026

PHOTO GALLERY: విశాఖలో మిలాన్-2026 రిహార్సల్స్

image

AP: విశాఖ సాగరతీరంలో ఈ సాయంత్రం మిలాన్-2026 రిహార్సల్స్ జరిగాయి. యుద్ధనౌకలు సందడి చేశాయి. 45 భారతీయ నౌకలతో పాటు మొత్తం 71 యుద్ధనౌకలు, సబ్ మెరైన్లు, ఫైటర్ జెట్లు, హెలికాప్టర్లు ప్రదర్శనలో పాల్గొన్నాయి. పెద్దఎత్తున విశాఖ ప్రజలు ఈ విన్యాసాలను వీక్షించారు. రేపు మిలాన్-2026 జరగనుంది.