News April 27, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News February 11, 2026
జగన్‌తో కలిసి నిరసన తెలిపిన అల్లూరి జిల్లా ఎమ్మెల్యేలు

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ్టి నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సమవేశాలకు పాడేరు, అరకు ఎమ్మెల్యేలు మత్స్యరాస విశ్వేశ్వరరాజు, రేగం మత్స్యలింగం హాజరయ్యారు. ముందుగా జగన్‌తో కలిసి అసెంబ్లీ బయట ఎమ్మెల్యేలు ర్యాలీ చేపట్టారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. తర్వాత అసెంబ్లీలోకి వెళ్లిన రామచంద్రారెడ్డి కాసేపటికే వాకౌట్ చేసి వచ్చేశారు.
News February 11, 2026
GHMC స్పెషల్ ఆఫీసర్‌గా జయేశ్ రంజన్

తెలంగాణలోని జీహెచ్‌ఎంసీ, సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్లకు స్పెషల్ ఆఫీసర్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారి జయేష్ రంజన్‌ను బాధ్యతలు స్వీకరించారు. మేయర్ గద్వాల విజయలక్ష్మితో పాటు కౌన్సిల్ సభ్యుల పదవీకాలం ముగియడంతో పాలనా బాధ్యతల నిర్వహణకు ఈ నిర్ణయం తీసుకున్నారు. GO 203 ద్వారా ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇక నుంచి 3 కార్పొరేషన్ల బాధ్యతలు ఆయన చూసుకోనున్నారు.
News February 11, 2026
వనపర్తి: ఓటేసిన 102 ఏళ్ల బామ్మ..!

వనపర్తి జిల్లా అమరచింత మున్సిపాలిటీ కేంద్రంలోని ఎనిమిదో వార్డులో 102 ఏళ్ల వృద్ధురాలు జహీరాబీ బుధవారం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తనకు 102 సంవత్సరాలు నిండాయని, మొదట వేసిన ఓటు గుర్తులేదని జహీరాబీ చెప్పారు. ఆమె ఓటేసేందుకు ఎస్ఐలు స్వాతి, శివకుమార్ సహకరించారు. ఎస్ఐలు మాట్లాడుతూ.. జహీరాబీని అందరూ ఆదర్శంగా తీసుకుని ఓటేసేందుకు యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు.


