News April 27, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News February 18, 2026

చిత్తూరు: స్నేక్ రెస్క్యూపై ప్రత్యేక చర్యలు.!

image

పాముల సంరక్షణపై అటవీశాఖ కీలక నిర్ణయాలు తీసుకుంది. ‘సర్పమిత్ర’ కార్యక్రమంలో వాలంటీర్లకు శిక్షణ ఇచ్చి HWC హాట్‌స్పాట్స్‌లో పాములను కాపాడే విధంగా ప్రణాళిక రూపొందించింది. టీమ్‌లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి సర్పమిత్ర ట్రైనర్లుగా నియమించనున్నారు. నిపుణులు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో స్నేక్ రెస్క్యూ సర్టిఫికేషన్ కోర్సు ప్రారంభించి, పాముల పట్టివేత, సురక్షిత హ్యాండ్లింగ్‌పై ప్రొటోకాల్ రూపొందించనున్నారు.

News February 18, 2026

కూరగాయలు తాజాగా ఉండాలంటే?

image

కూరగాయలు తాజాగా ఉండటానికి జపనీయులు కాటన్, మస్లిన్ వస్త్రంలో చుట్టేస్తారు. ఆకుకూరలను కాస్త తడిపిన క్లాత్‌లో చుట్టి ఫ్రిడ్జ్‌లో ఉంచుతారు. అలాగే ఫ్రిడ్జ్‌లో కూరగాయలు పెట్టాలి అనుకున్నప్పుడు వాటిని శుభ్రంగా కడిగి, తుడిచి పొడిగా ఉన్నప్పుడే పెట్టాలి. పండిపోయినవి త్వరగా వాడేయాలి. లేదంటే వాటి ప్రభావం వేరే కూరగాయలపై పడుతుంది. అలాగే టైట్‌ కవర్‌లో కూరగాయలు పెట్టడం వల్ల తర్వరగా పాడైపోతాయి.

News February 18, 2026

డిన్నర్ ఎప్పుడు చేస్తున్నారు?

image

నిద్ర పోయే 3 గంటల ముందే భోజనం చేయడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని వైద్యులు సూచిస్తున్నారు. దీనివల్ల రక్తపోటు 3.5%, హార్ట్ బీట్ 5% తగ్గుతాయని చెబుతున్నారు. ‘ఆలస్యంగా తినడం వల్ల శరీరం జీర్ణక్రియలోనే నిమగ్నమైపోతుంది. ‘మెదడు క్లీనింగ్’ ప్రాసెస్‌కూ ఆటంకం ఏర్పడుతుంది. ఆహారం మార్చకుండా, కేవలం సమయం మార్చడం ద్వారా మీ ఆయుష్షును పెంచుకోవచ్చు. ఆరోగ్యకరమైన జీవనశైలికి ఇలా చేయండి’ అని తెలిపారు. share it