News April 27, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News February 17, 2026
నైట్ షాపింగ్‌కు ముస్తాబవుతున్న హైదరాబాద్

మరో 3రోజుల్లో రంజాన్ మాసం ప్రారంభం కానుండటంతో పాతబస్తీలో సందడి మొదలైంది. ఈ నెల 19 నుంచి ఉపవాస దీక్షలు ప్రారంభమయ్యే అవకాశముండటంతో చార్మినార్ పరిసరాల్లో వ్యాపారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. నెల రోజుల పాటు కొనసాగే నైట్ షాపింగ్‌తో పాటు, నోట్లో కరిగిపోయే హలీం రుచులను ఆస్వాదించేందుకు నగరవాసులు భారీగా తరలిరానున్నారు. దీంతో ఓల్డ్ సిటీ సరికొత్త వెలుగులతో కళకళలాడుతోంది.
News February 17, 2026
ముగ్గురు IASలను పెళ్లి చేసుకున్న IAS ఆఫీసర్!

IAS ఆఫీసర్ అవీ ప్రసాద్ 3 పెళ్లిళ్లు చేసుకోవడం, ముగ్గురు భార్యలూ IASలే కావడం చర్చనీయాంశంగా మారింది. మధ్యప్రదేశ్ క్యాడర్(2014 బ్యాచ్)కి చెందిన ప్రసాద్ తొలుత IAS రిజు బఫ్నాను పెళ్లి చేసుకున్నారు. తర్వాత విడాకులు తీసుకొని 2016 బ్యాచ్ ఆఫీసర్ మిషా సింగ్‌ను వివాహమాడారు. 4ఏళ్ల తర్వాత ఆమె నుంచీ విడిపోయారు. ఈనెల 11న 2017 బ్యాచ్ ఆఫీసర్ అంకిత ధాక్రేను పెళ్లాడారు. వీరంతా ప్రస్తుతం MPలోనే పనిచేస్తున్నారు.
News February 17, 2026
HNK: జేఈఈ మెయిన్స్‌లో హర్షిత్‌కు 99.58 పర్సంటైల్

హనుమకొండ తహశీల్దారు గుజ్జుల రవీందర్ రెడ్డి కుమారుడు హర్షిత్ రెడ్డి జేఈఈ మెయిన్స్‌లో 99.58 పర్సంటైల్ సాధించారు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో అత్యుత్తమ ఫలితం సాధించేందుకు ఇంకా కృషి చేస్తానన్నారు. హనుమకొండలో పాఠశాల విద్యాభ్యాసం, హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కళాశాలో సెకండియర్ చదువుతున్నాడు. తన కుమారుడు అత్యుత్తమ పర్సంటైల్ సాధించడం ఆనందంగా ఉందని తహశీల్దారు పేర్కొన్నారు.


