News April 27, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News February 9, 2026

బర్డ్ ఫ్లూ.. అన్నమయ్య కలెక్టర్ కీలక ప్రకటన

image

బర్డ్ ఫ్లూసోకిన కోళ్ల ఖననం కోసం 8 రాపిడ్ రెస్పాన్స్ బృందాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని సదుం మండలంలొని రెండు కోళ్లఫారాలలో బర్డ్ ఫ్లూ సోకి పెద్ద సంఖ్యలొ ఫారం కోళ్లు చనిపోవడం తెలిసిందే. దీనిపై కలెక్టర్ బర్డ్ ఫ్లూ సమాచారం, అనుమానాల నివృత్తి కోసం కంట్రోల్ రూం ఏర్పాటును ఏర్పాటు చేశారు. ఏవైనా అనుమానాలు ఉంటే 7013914401, 9398262752 ఈ నంబర్లకు కాల్ చేయాలన్నారు.

News February 9, 2026

గొర్రెల మందలో విత్తన పొట్టేలు ప్రాముఖ్యత

image

గొర్రెల మంద పెరగాలన్నా, నాణ్యమైన పిల్ల రావాలన్నా, మందలో ప్రతీ 20-25 గొర్రెలకు మంచి విత్తన పొట్టేలును ఎంపిక చేసుకోవాలి. అది బలంగా, ఎత్తుగా ఉండాలి. చాలా మంది రైతులు తమ మందలో పుట్టిన పిల్లను విత్తనం కోసం ఎంపిక చేసుకుంటారు. దీని వల్ల నాణ్యమైన పిల్ల పుట్టకపోగా, బలహీనంగా, అంగవైకల్యంతో, తక్కువ బరువు, సంతానోత్పత్తికి పనికిరాకుండా ఉంటాయి. అందుకే వేరే మంద నుంచి నాణ్యమైన పొట్టేలును ఎంపిక చేసుకోవడం ఉత్తమం.

News February 9, 2026

జనగామ కాంగ్రెస్‌లో భగ్గుమంటున్న వర్గపోరు!

image

జనగామ కాంగ్రెస్‌లో వర్గపోరు భగ్గుమంటోంది. వేదిక ఏదైనా, కార్యక్రమం ఏదైనా వర్గపోరు రాజుకుంటోంది. మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి వచ్చిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో మరోసారి వర్గపోరు బహిర్గతమైంది. శనివారం జరిగిన కాంగ్రెస్ కార్నర్ మీటింగ్‌లో నూతన డీసీసీ అధ్యక్షురాలు ప్రసంగిస్తుండగా కొమ్మూరి ప్రతాప్ రెడ్డి అనుచరులు డీసీసీ అధ్యక్షుడు ప్రశాంత్ రెడ్డి అంటూ నినాదాలు చేయడం గమనార్హం.