News April 27, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News February 12, 2026

ఒమన్‌పై లంక ఘన విజయం

image

T20WCలో ఒమన్‌పై శ్రీలంక 105 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత శ్రీలంక 225/5 స్కోర్ చేసింది. కుశాల్ మెండిస్(61), పవన్(60), దసున్ శనక(50) హాఫ్ సెంచరీలతో రాణించారు. 226 రన్స్ టార్గెట్‌తో బరిలో దిగిన ఒమన్ 120/9 స్కోరుకే పరిమితమైంది. ఈ విజయంతో గ్రూప్-Bలో లంక(4 పాయింట్లు) అగ్రస్థానానికి చేరుకుంది. తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై గెలిచిన విషయం తెలిసిందే.

News February 12, 2026

సంగారెడ్డి: ఈనెల 17 నుంచి ఫ్రీ ఫైనల్ పరీక్షలు

image

సంగారెడ్డి జిల్లాలోని అన్ని పాఠశాలల్లో ఈనెల 17 నుంచి 24 వరకు పదో తరగతి ఫ్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు డీఈఓ వెంకటేశ్వర్లు వెల్లడించారు. ప్రతిరోజూ ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపారు. ప్రధానోపాధ్యాయులు మండల వనరుల కేంద్రాల నుండి ప్రశ్నపత్రాలను సేకరించాలని సూచించారు. వార్షిక పరీక్షలకు ముందు విద్యార్థుల సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు పరీక్షలు దోహదపడతాయన్నారు.

News February 12, 2026

విశాఖలో జిల్లా స్థాయి క్రీడా ఎంపికలు

image

విశాఖపట్నం జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి జూన్ జి.విలియమ్స్ సాప్ (SAAP) లీగ్స్ జిల్లా స్థాయి ఎంపికల వివరాలను వెల్లడించారు. ఫిబ్రవరి 17న గోపాలపట్నం ఇండోర్ స్టేడియంలో చదరంగం, 24న బీచ్ రోడ్డులో సైక్లింగ్ పోటీలు జరుగుతాయి. ఆసక్తిగల క్రీడాకారులు తమ ఆధార్ కార్డుతో సాప్ (SAAP) అధికారిక వెబ్‌సైట్‌లో తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాలని ఆమె సూచించారు.