News April 27, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News February 17, 2026

గోమాత దర్శనంలో పఠించాల్సిన మంత్రం

image

1. నమో గోభ్యః శ్రీమతీభ్యః సౌరభేయాభ్య ఏవచl
నమో బ్రహ్మనుతాభ్యశ్చ పవిత్రాభ్యో నమోనమఃll
2. గావో మమాగ్రతః నను గావో మే సంతు పృష్టతఃl
గావో మే హృదయం నిత్యం గవాం మధ్యే వసామ్యాహంll
3. సర్వ దేవమయే దేవి సర్వ దేవైరలం కృతేl
మమాభిలషితంకర్మ సఫలం కురు నందినిll
గోమాతకు ఆహారం పెట్టేటప్పుడు:
ప౦చభూతశివే! పుణ్యే! పవిత్రే! సూర్య సంభవే!
ప్రతీచ్ఛేమం మయాదత్తం సౌరభేయి! నమోస్తుతే!!

News February 17, 2026

జేఈఈ మెయిన్స్ సీజన్-1 ఫలితాలలో ‘శశి’ విద్యార్థుల సత్తా

image

జేఈఈ మెయిన్స్ సీజన్-1 ఫలితాలలో వైజాగ్ క్యాంపస్‌కు చెందిన ‘శశి’ విద్యార్థులు ప్రతిభ చాటారని ఆ విద్యాసంస్థల ఛైర్మన్ బూరుగుపల్లి వేణుగోపాల కృష్ణ, వైస్ ఛైర్మన్ నరేంద్రకృష్ణ తెలిపారు. 99కి పైగా పర్సంటైల్ 11 మంది సాధించారన్నారు. వి.గోపాలస్వామి(99.65), ఎస్. శ్రీరామ్(99.83), కె.ఎస్.దుర్గా(99.76), వై.తపన్ సాయి(99.71), ఓ.హర్ష(99.65), బి.ఎస్ వంశీ(99.52), జి.భరత్ (99.39), కె.ధనుష్ (99.27) ప్రతిభ చాటారన్నారు.

News February 17, 2026

పాఠశాలల్లో పనులు సకాలంలో పూర్తి చేయాలి: కలెక్టర్

image

పాఠశాలల్లో అభివృద్ధి పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తిచేయాలని కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. వర్షాకాలంలోపు గ్రౌండ్ లెవలింగ్ పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. విద్యార్థుల సంఖ్య అధికంగా ఉన్న ప్రాథమిక పాఠశాలలో కంప్యూటర్ ఏర్పాటు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. సీపీవో రవీందర్, డీసీహెచ్‌వో శ్రీధర్, పీఎం షేక్ పాల్గొన్నారు.