News April 27, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News February 16, 2026
విప్ ఇద్దామంటే BRSకు దొరకని ఆ MLAలు

TG: హంగ్ ఏర్పడ్డ మున్సిపాల్టీల్లో ఎక్స్ అఫీషియో సభ్యులుగా MLA, MLC, MP ఓట్లు కీలకంగా మారడంతో పార్టీలు వారికి విప్ జారీ చేస్తున్నాయి. వాటిని వ్యక్తిగతంగా అందించి సంతకాలు కూడా తీసుకోవాలి. BRSకు ఇదే తలపోటుగా మారింది. INCకి సన్నిహితంగా ఉంటున్న MLAలకు విప్ ఇద్దామంటే పార్టీకి వారెవరూ అందుబాటులో లేరు. వారెవరూ విప్ అందుకోలేదు. గద్వాల వంటి చోట్ల BRS MLAనే INC అభ్యర్థిని ఛైర్మన్ సీట్లో కూర్చోబెట్టారు.
News February 16, 2026
తంటికొండ ఆలయంలో అపచారం.. ఈవో వివరణ ఇదే!

తంటికొండ వేంకటేశ్వర స్వామి ఆలయ అన్నప్రసాద వితరణలో ‘<<19155626>>మేరీ క్రిస్మస్<<>>’ అని ఉన్న విస్తరాకులు వాడటంపై ఈఓ ఉదయ భాస్కర్ నాయుడు వివరణ ఇచ్చారు. పొరపాటున వచ్చిన ఆ ఆకులను గుర్తించిన వెంటనే ధ్వంసం చేశామని సోమవారం తెలిపారు. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన జాగ్రత్తలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
News February 16, 2026
నెల్లూరు: పరీక్షలా? క్రికెట్ మ్యాచ్‌లా?

10వ తరగతి, ఇంటర్ విద్యార్థులు పరీక్షలుపై ఫోకస్ చేయాలా? మ్యాచ్‌లు చూడాలా అన్న సందిగ్ధంలో ఉన్నారు. ఈ నెల 17 నుంచి CBSE పరీక్షలు ప్రారంభం కానుండగా, 23 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. T20 వరల్డ్ కప్ జరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులు మ్యాచ్‌లు చూస్తూ టీవీలకు అతుక్కుపోతున్నారు. విద్యార్థుల జీవితాల్లో ముఖ్యమైన పరీక్షలు కావడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు.


