News April 27, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News February 18, 2026

NZB: ‘భగత్ సింగ్ స్ఫూర్తితో విద్యార్థులు ఉద్యమించాలి’

image

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానం రద్దు చేయాలని, ప్రభుత్వాలు కార్పొరేట్ యాజమాన్యానికి వత్తాసు పలుకకుండా, అందరికీ ఒకే ఉచిత విద్యా విధానాన్ని రూపొందించాలని కొత్తగూడెం MLA కూనంనేని సాంబశివరావు అన్నారు. NZBలో బుధవారం ప్రారంభమైన AISF రాష్ట్ర 4 మహాసభల్లో ఆయన మాట్లాడారు. భగత్ సింగ్, చేగువేరా స్ఫూర్తితో విద్యార్థులు ఉద్యమించాలన్నారు.

News February 18, 2026

AIతో కొత్త మతాలు.. మిషనరీలు: హరారీ

image

దావోస్‌లో నిఖిల్ కామత్‌తో జరిగిన చర్చలో ప్రముఖ చరిత్రకారుడు యువల్ నోవా హరారీ మతంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో AI కొత్త మతాలను సృష్టించడమే కాకుండా, సొంత మిషనరీలను కూడా కలిగి ఉండొచ్చని అంచనా వేశారు. మతగ్రంథాల సారాంశాన్ని విశ్లేషించడంలో మనుషుల కంటే AI మెరుగ్గా ఉంటుందని తెలిపారు. భక్తుల ప్రశ్నలకు నేరుగా సమాధానమిస్తుందని పేర్కొన్నారు.

News February 18, 2026

ADB: కలప రవాణా ఇక పూర్తిగా ఆన్‌లైన్‌

image

కలప రవాణా నిబంధనల్లో కేంద్రం కీలక మార్పులు చేసింది. ఇకపై సామిల్లులకు ఆఫ్‌లైన్ పర్మిట్ల విధానాన్ని రద్దు చేస్తూ పూర్తిస్థాయిలో ఆన్‌లైన్‌ (NTPS) ద్వారా అనుమతులు జారీ చేయనుంది. పర్మిట్ జారీ చేసిన 24 గంటల్లోపు కలపను గమ్యస్థానానికి చేర్చాల్సి ఉంటుంది. గడువు దాటితే పోర్టల్‌లో మళ్లీ అప్‌డేట్ చేయాల్సిందే. ఉమ్మడి జిల్లాలోని 35కు పైగా సామిల్లుల నుంచి 2 తెలుగు రాష్ట్రాలకు జరిగే కలప రవాణాపై నిఘా పెరగనుంది.