News April 27, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News February 9, 2026
ఆజాద్ హింద్ ఫౌజ్ సైనికుడితో మోదీ

నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలోని ఆజాద్ హింద్ ఫౌజ్‌లో పని చేసిన సైనికుడు జయరాజ్ రాజారావును PM మోదీ కలిశారు. మలేషియాలో పర్యటనలో ఉన్న ఆయన కౌలాలంపూర్‌లో ఈ మేరకు భేటీ అయ్యారు. ‘రాజారావు జీవితం అపార ధైర్యం, త్యాగాలతో నిండింది. ఆయన అనుభవాలను వినడం స్ఫూర్తి కలిగించింది. భారతదేశ భవితవ్యాన్ని రూపొందించడంలో సాయపడిన INA సైనికులు, నేతాజీకి మనం ఎప్పటికీ రుణపడి ఉంటాం’ అని మోదీ పేర్కొన్నారు.
News February 9, 2026
చంద్రుడిపై సిటీ నిర్మాణం.. పదేళ్లలోనే పూర్తి: మస్క్

చంద్రుడిపై సెల్ఫ్ గ్రోయింగ్ సిటీని నిర్మించడంపై SpaceX దృష్టిసారించిందని, ఇది 10ఏళ్లలోనే పూర్తవుతుందని ఎలాన్ మస్క్ తెలిపారు. అంగారకుడిపై దీనికి 20+Y పడుతుందన్నారు. ‘గ్రహాలు 26 నెలలకొసారి సమాంతరంగా చేరినప్పుడే 6 నెలల్లో మార్స్‌కు ప్రయాణించగలం. 10 రోజులకోసారి 2 రోజుల్లో చంద్రుడిపైకి వెళ్లొచ్చు కాబట్టి అక్కడ సిటీని వేగంగా పూర్తిచేయగలం. భవిష్యత్తు నాగరికతను కాపాడటమే మా లక్ష్యం’ అని Xలో పేర్కొన్నారు.
News February 9, 2026
బర్డ్ ఫ్లూ.. అన్నమయ్య కలెక్టర్ కీలక ప్రకటన

బర్డ్ ఫ్లూసోకిన కోళ్ల ఖననం కోసం 8 రాపిడ్ రెస్పాన్స్ బృందాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని సదుం మండలంలొని రెండు కోళ్లఫారాలలో బర్డ్ ఫ్లూ సోకి పెద్ద సంఖ్యలొ ఫారం కోళ్లు చనిపోవడం తెలిసిందే. దీనిపై కలెక్టర్ బర్డ్ ఫ్లూ సమాచారం, అనుమానాల నివృత్తి కోసం కంట్రోల్ రూం ఏర్పాటును ఏర్పాటు చేశారు. ఏవైనా అనుమానాలు ఉంటే 7013914401, 9398262752 ఈ నంబర్లకు కాల్ చేయాలన్నారు.


