News April 27, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News February 19, 2026
ప్రపంచ సమస్యలకు భారత్ దగ్గర పరిష్కారం: మోహన్ భాగవత్

అమెరికా, చైనా వంటి దేశాలు కేవలం తాము శక్తిమంతంగా మారడమే లక్ష్యంగా పెట్టుకొని ప్రపంచానికి హాని కలిగిస్తున్నాయని RSS చీఫ్ మోహన్ భాగవత్ విమర్శించారు. పాశ్చాత్య దేశాలు భారతీయ విద్యావ్యవస్థను తమ స్వార్థం కోసం మార్చేశాయని లక్నో యూనివర్సిటీలో మండిపడ్డారు. ప్రపంచ సమస్యలకు పరిష్కారం చూపే సత్తా భారత్‌కే ఉందని అయితే ఆ నిజాన్ని ప్రపంచం నమ్మాలంటే దేశం అన్ని రంగాల్లో మరింత శక్తిమంతం కావాలని పిలుపునిచ్చారు.
News February 19, 2026
ధర్మారం: డివైడర్‌ను ఢీకొని ఇద్దరు యువకులకు గాయాలు

ధర్మారం మండల కేంద్రంలోని అయ్యప్ప గుడి సమీపంలో ద్విచక్ర వాహనం డివైడర్‌ను ఢీకొనడంతో ఇద్దరు యువకులు గాయపడ్డారు. కొత్తూరు గ్రామానికి చెందిన మద్దెల సాగర్ (20) తలకు, కుడిచేతికి తీవ్ర గాయాలు కాగా, మేకల వంశీ (20) కుడికాలికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఆరె సతీష్ (ఈఎమ్‌టీ), పైలట్ శ్రీనివాస్ ప్రథమ చికిత్స అందించి కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.