News April 27, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News February 16, 2026

గద్వాల: మూడు తరాలు.. ఒకే కుటుంబం.. తుమ్మల వారి అరుదైన రికార్డు!

image

గద్వాల మున్సిపల్ రాజకీయంలో ‘తుమ్మల’ కుటుంబం సరికొత్త చరిత్ర సృష్టించింది. 1988లో మామ, 2000లో అత్త, 2014లో భర్త కౌన్సిలర్లుగా ఎన్నికవ్వగా.. ఇప్పుడు అదే వారసత్వంతో తుమ్మల జయలక్ష్మి మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. 30 ఏళ్లుగా మూడు తరాలుగా విజయం సాధిస్తూ ఈ కుటుంబం అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.

News February 16, 2026

12 ఏళ్లకే వండర్ చేశాడు

image

Phd విద్యార్థుల కలను ఏడో తరగతి విద్యార్థి మెక్‌మిలన్(12) సాధించాడు. US డల్లాస్‌లో చిన్న ప్లేరూమ్‌లో న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్‌ను నిర్మించాడు. 8 ఏళ్లకే న్యూక్లియర్ ఫిజిక్స్‌పై ఆసక్తి పెంచుకున్న చిన్నోడు ఓ సంస్థ సాయంతో ఈ ప్రాజెక్టును నిర్మించాడు. శాస్త్రీయ ఆవిష్కరణలకు వయసుతో సంబంధం లేదని చాటాడు. 2 తేలికైన పరమాణు కేంద్రకాలు కలిసి బలమైన కేంద్రకంగా మారినప్పుడు భారీగా శక్తి విడుదలవ్వడమే ఈ ప్రక్రియ.

News February 16, 2026

సిద్దిపేట: సీల్డ్ కవర్ కోసం ఎదురుచూపులు

image

హుస్నాబాద్, చేర్యాల, గజ్వేల్, దుబ్బాక మున్సిపల్ పాలకవర్గాలు ఈరోజు కొలువు తీరనున్నాయి. ఛైర్మన్ ఎవరనేది ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. సీల్డ్ కవర్‌లో ఎవరి పేరుందనని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. హుస్నాబాద్ నుంచి దండి లక్ష్మి పేరు ఫిక్స్ అయినట్లు సమాచారం. దుబ్బాకలో శ్రీరామ్ సంగీత, బండి శీలత మధ్య పోటీ ఉంది. గజ్వేల్‌లో కళ్యాణ్కర్ పద్మాబాయి, గంగిశెట్టి చందన, చేర్యాలలో అరుణ, గీతాంజలి పేర్లు ఉన్నాయి.