News April 27, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News February 15, 2026
సంగారెడ్డి: ఈనెల 16న ప్రజావాణి రద్దు: కలెక్టర్ ప్రావీణ్య

మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 16న (సోమవారం) నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. సంగారెడ్డి జిల్లా అధికారులు ఎన్నికల విధుల్లో నిమగ్నమై ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు ఈ మార్పును గమనించి జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కలెక్టర్ కోరారు. తదుపరి ప్రజావాణి యథావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేశారు.
News February 15, 2026
పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
News February 15, 2026
కోటప్పకొండ తిరునాళ్లకు పటిష్ఠ భద్రతా చర్యలు

కోటప్పకొండ తిరునాళ్ల బందోబస్తుపై పోలీస్ శాఖ ప్రత్యేక సమీక్ష నిర్వహించింది. స్థానిక జిల్లా పరిషత్ పాఠశాలలో జరిగిన సమావేశంలో ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి, ఎస్పీ కృష్ణారావు పాల్గొని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఉత్సవాలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్ఠ భద్రతా చర్యలు చేపడుతున్నట్లు వారు వెల్లడించారు. శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేశారు.


