News April 25, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News March 11, 2026

టీమ్ ఇండియాపై పాక్ మాజీ క్రికెటర్ ప్రశంసలు

image

T20WCలో భారత్ తమకు అనుకూలంగా పిచ్‌లను తయారుచేసుకుందనే ఆరోపణలను పాక్ మాజీ క్రికెటర్ ఇమాద్ వసీమ్ ఖండించారు. ‘ఇండియా ఫ్రెండ్లీ పిచ్‌లు తయారుచేసుకుందని లేదా అంపైర్లు వారికి అనుకూలంగా వ్యవహరించారని చాలా మంది అంటుంటారు. కానీ ఈ టోర్నమెంటులో పిచ్‌లు చాలా బ్యాలెన్స్‌డ్‌గా ఉన్నాయి. కొన్నిసార్లు పరిస్థితులు ఇండియాకు ప్రతికూలంగా ఉన్నా మంచి ఆటతీరు కనబరిచారు. వాళ్లు మనకంటే చాలా బాగా ఆడారు’ అని ప్రశంసించారు.

News March 11, 2026

కామారెడ్డి: పదో తరగతి పరీక్షలకు ఎన్ని సెంటర్లంటే..

image

కామారెడ్డి జిల్లాలో 65 పరీక్షా కేంద్రాల్లో ఈ నెల 14 నుంచి ఏప్రిల్ 16 వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. పరీక్ష కేంద్రాల్లో 739 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. ప్రతి పరీక్ష కేంద్రానికి ఒక చీఫ్ సూపరింటెండెంట్, ఒక డిపార్ట్మెంటల్ అధికారులతో పాటు అదనంగా అదనపు డిపార్ట్‌మెంట్ అధికారులు ఏడుగురిని నియమించారు. 13,154 మంది విద్యార్థులు పరీక్షలు రాయనుండగా, అధికారులు ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నారు.

News March 11, 2026

NLC ఇండియా లిమిటెడ్‌లో 16 పోస్టులు

image

నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్(NLC) ఇండియా లిమిటెడ్‌ 16 హెల్త్ ఇన్‌స్పెక్టర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. అర్హులకు ఇంటర్/డిప్లోమా(శానిటరీ ఇన్‌స్పెక్టర్‌)/బ్యాచిలర్ డిగ్రీ/పీజీ డిప్లోమాతో పాటు ఉద్యోగ అనుభవం ఉండాలని పేర్కొంది. వయసు 30 ఏళ్లు దాటకూడదు. వేతనం రూ.38 వేలు. రాత పరీక్షతో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు 02-04-2026 చివరి తేదీ. మరిన్ని వివరాలకు www.nlcindia.in చూడండి.