News April 27, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News February 13, 2026
మున్సిపాలిటీలో ‘హంగ్’ ఉత్కంఠ: కింగ్ మేకర్లుగా ఎక్స్-అఫీషియో ఓట్లు..!

అలంపూర్ పురపాలక ఎన్నికల సమరం ముగిసింది, కానీ అసలు సిసలైన రాజకీయ చదరంగం ఇప్పుడే మొదలైంది. ఫలితాల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో ‘హంగ్’ ఏర్పడి, ఛైర్మన్ పీఠం ఎవరికి దక్కుతుందనేది ఇప్పుడు మిస్టరీగా మారింది. ఛైర్మన్ ఎన్నికలో నిర్ణయాత్మక శక్తిగా మారనున్న ఎక్స్-అఫీషియో ఓట్లు ప్రస్తుతం బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నాయి. ఆ పార్టీ నుంచి స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు ఓటు హక్కులు ఉన్నాయి.
News February 13, 2026
మంచిర్యాల కార్పొరేషన్ కాంగ్రెస్ కైవసం

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లో కాంగ్రెస్ జెండా ఎగిరింది. 60 స్థానాలు ఉండగా 44 డివిజన్‌ల కార్పొరేట్ స్థానాలను కాంగ్రెస్ సాధించింది. బీఆర్ఎస్ 8, బీజేపీ 5, ఫార్వర్డ్ బ్లాక్ 2, జనసేన ఒక డివిజన్లో గెలుపొందాయి. 57వ డివిజన్లో రీకౌంటింగ్ చేయగా బీజేపీ అభ్యర్థి గెలుపొందాడు.
News February 13, 2026
మెట్‌పల్లి మున్సిపాలిటీలో బీజేపీ హవా

మెట్‌పల్లి మున్సిపాలిటీలో బీజేపీ సత్తా చాటింది. మెట్‌పల్లి మున్సిపాలిటీలో మొత్తం 26 వార్డులు ఉండగా.. అందులో బీజేపీ 10 స్థానాలను గెలుచుకుంది. కాంగ్రెస్ పార్టీ 6 స్థానాలను, బీఆర్ఎస్ పార్టీ 6 స్థానాలను గెలుచుకోగా స్వతంత్రులు 4 స్థానాలలో గెలుపొందారు. కాగా, ఛైర్‌పర్సన్ స్థానాన్ని చేజిక్కించుకోవడానికి ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ లభించలేదు. ఛైర్‌పర్సన్ ఎన్నికలో స్వతంత్రులు కీలకం కానున్నారు.


