News April 27, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News February 11, 2026
WGL: 9 గంటల వరకు 12.44 శాతం పోలింగ్

వరంగల్ జిల్లా మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియలో తొలి రెండు గంటల్లో జిల్లా వ్యాప్తంగా సగటున 12.44 శాతం ఓటింగ్ నమోదైంది. వర్ధన్నపేట మున్సిపాలిటీలో 13.02 శాతంతో ఓటర్లు చైతన్యం చూపగా, నర్సంపేటలో 12.29 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు పటిష్ఠ చర్యలు చేపట్టారు.
News February 11, 2026
జగిత్యాల: ఉదయం 9 గంటల వరకు 12% పోలింగ్

జగిత్యాల జిల్లాలో బుధవారం ఉదయం 9 గంటల వరకు మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది. ధర్మపురి మున్సిపాలిటీలో 16.40 శాతం పోలింగ్ నమోదై ముందంజలో నిలిచింది. జగిత్యాలలో 13.22 శాతం, రాయికల్‌లో 12.97 శాతం పోలింగ్ జరిగింది. కోరుట్లలో 10.38 శాతం, మెట్‌పెల్లిలో 10.30 శాతం పోలింగ్ నమోదు అయింది. ఐదు మున్సిపాలిటీలలో సగటు పోలింగ్ శాతం 12.04గా నమోదైంది.
News February 11, 2026
బడ్జెట్ సమావేశాలకు విజయనగరం ఎమ్మెల్యేలు

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో విజయనగరం జిల్లాకు చెందిన కూటమి ఎమ్మెల్యేలు ఇప్పటికే అసెంబ్లీకు చేరుకున్నారు. జిల్లాలోని సాగునీరు, తాగునీటి సమస్యలతో పాటు పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి నిధులు, హామీల అమలు, ఆసుపత్రులు, రోడ్ల అభివృద్ధికి నిధుల కేటాయింపు, నిరుద్యోగుల సమస్యలపై ప్రజాప్రతినిధులు గళమెత్తాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.


