News April 27, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News February 10, 2026
మహాశివరాత్రి సందర్భంగా పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు: ఎస్పీ

మహాశివరాత్రి సందర్భంగా జిల్లాలోని ప్రముఖ ఆలయాల వద్ద పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు SP మాధవరెడ్డి తెలిపారు. మంగళవారం పార్వతీపురంలోని తన కార్యాలయం నుంచి VC నిర్వహించారు. శివరాత్రిని పురస్కరించుకొని తగిన బందోబస్తు ఏర్పాట్లు, సిబ్బంది నిర్వర్తించాల్సిన విధుల పట్ల తగు సూచనలు, కీలక ఆదేశాలు జారీ చేశారు. భక్తులకు సులభమైన, సురక్షితమైన దర్శనాన్ని కల్పించేలా క్యూ లైన్ల వద్ద బందోబస్త్ పెంచాలన్నారు.
News February 10, 2026
ANU: డీపీఈడీ, ఎంపీఈడీ మూడో సెమిస్టర్ పరీక్ష ఫలితాలు విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో గత డిసెంబర్‌లో జరిగిన మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, డిప్లమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ మూడో సెమిస్టర్ పరీక్ష ఫలితాలను విడుదల చేసినట్లు పరీక్షల నిర్వహణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు మంగళవారం తెలిపారు. రీవాల్యుయేషన్‌కు దరఖాస్తులను ఈనెల 19 తేదీలోగా అందించాలని సూచించారు. వివరాలకు వర్సిటీ అధికారిక వెబ్‌సైట్ https://www.nagarjunauniversity.ac.in/ను సంప్రదించాలన్నారు.
News February 10, 2026
దీనస్థితిలో ఉన్నానంటూ సీనియర్ నటుడి ఆవేదన

తాను దీనస్థితిలో ఉన్నానని బాలీవుడ్ సీనియర్ నటుడు రాజ్‌పాల్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. చెక్ బౌన్స్ కేసులో ఢిల్లీ HC గతవారం తీహార్ జైలు అధికారి ఎదుట లొంగిపోవాలని ఆదేశించింది. దీంతో జైలుకెళ్లే ముందు ఓ ఇంటర్వ్యూలో ‘కష్టాల్లో ఆదుకునేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఇండస్ట్రీలో ఎవరి లైఫ్ వారిదే’ అని వాపోయారు. ‘అతా పతా లాపతా’ మూవీతో డైరెక్టర్‌గా మారేందుకు ఆయన ఓ వ్యాపారి వద్ద ₹5Cr అప్పుచేసి తిరిగివ్వలేదు.


