News April 27, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News February 16, 2026
అనకాపల్లిలో ఒంటరి మహిళ సజీవ దహనం

అనకాపల్లి పట్టణంలోని గూడ్స్ రోడ్డు వద్ద విషాదకర ఘటన చోటు చేసుకుంది. రైల్వే ప్రహరీకు ఆనుకుని ఉన్న ఒక రేకుల షెడ్‌లో ఆదివారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో అక్కడ నివసిస్తున్న లింగాల తలుపులమ్మ (45) అనే ఒంటరి మహిళ మంటల్లో చిక్కుకుని సజీవ దహనం అయ్యారు. చలి కారణంగా వేడి కోసం వెలిగించిన కుంపటి వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని ఫైర్ అధికారులు, పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
News February 16, 2026
పార్వతీపురం: బస్సు అంటే భయం!

ఒడిశా ఆర్టీసీ బస్సులలో ప్రయాణంపై జిల్లా ప్రయాణికుల్లో ఆందోళన పెరుగుతుంది. ఇటీవల జరుగుతున్న వరుస ప్రమాదాలే దీనికి కారణం. నిత్యం ఒడిశా నుంచి ఆంధ్రాకు రాత్రి పూట ఆర్టీసీ బస్సులు రాకపోకలు సాగిస్తుంటాయి. పి.కొనవలస ఘాట్ రోడ్డులో అత్యధిక మలుపులు కారణంగా బస్సులో సాంకేతిక సమస్యలు వచ్చి ప్రమాదాలకు కారణంగా భావిస్తున్నారు. గత మూడు నెలల క్రితం ఒక బస్సు దగ్ధం అవ్వగా, నిన్న సాలూరులో బస్సు బోల్తా పడింది.
News February 16, 2026
గద్వాల: ముగిసిన ఉత్కంఠ.. మున్సిపల్ సారథులు వీరే!

గద్వాల మున్సిపల్ పీఠంపై ఉత్కంఠ వీడింది. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తన వర్గానికే పీఠం దక్కేలా వ్యూహం ఫలించింది. మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా తుమ్మల జయలక్ష్మి, వైస్ ఛైర్మన్‌గా శంకర్ పేర్లను ఎమ్మెల్యే అధికారికంగా ఖరారు చేశారు. దీంతో గద్వాల గడ్డపై ఎమ్మెల్యే మరోసారి తన పట్టు నిరూపించుకున్నారు.


