News April 27, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News February 17, 2026

కామారెడ్డి: ఇందిరా గాంధీ, ఎన్టీఆర్ ఆదర్శం: ఎమ్మెల్యే

image

తనకు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రులు ఎన్టీఆర్, వైయస్ఆర్, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు తనకు ఆదర్శమని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి చెప్పారు. మంగళవారం కామారెడ్డిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇందిరాగాంధీలో పేదలకు చేసిన సేవ, చంద్రబాబు నాయుడులో ముందస్తు విజన్ తనకు ఆదర్శమన్నారు.

News February 17, 2026

GNT: అసెంబ్లీలో విద్యార్థుల సందడి

image

ఏపీ అసెంబ్లీ విద్యార్థులతో కిటకిటలాడింది. మంగళవారం సుమారు 300 మంది విద్యార్థులు సభను సందర్శించారు. గత ఐదు రోజుల్లో మొత్తం 1,100 మంది వచ్చారు. సభా కార్యక్రమాలను ఆసక్తిగా తిలకించారు. విరామ సమయంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, ఎమ్మెల్యేలు విద్యార్థులను పలకరించారు. వారి సందేహాలను స్పీకర్ నివృత్తి చేశారు. అనంతరం వారితో కలిసి ఫోటోలు దిగారు.

News February 17, 2026

హీరోయిన్‌గా ఖుష్బూ కూతురు

image

నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ సుందర్ కుమార్తె అవంతిక సుందర్ సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ‘ఆరంభం’ అనే మలయాళ చిత్రంలో ఆమె హీరోయిన్‌గా నటిస్తున్నారు. సుజేశ్ అన్నీ ఈపెన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆమె ‘ఆరతి’ అనే పాత్రలో కనిపించనున్నారు. సుమారు 35 ఏళ్ల క్రితం ఖుష్బూ కూడా మలయాళ సినిమాతోనే కెరీర్ ప్రారంభించడం విశేషం. మలయాళం, తమిళం భాషల్లో ఈ చిత్రం విడుదలవనుంది.