News April 27, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News February 18, 2026

కామారెడ్డి: రంజాన్ ప్రారంభం.. తరావీహ్ నమాజ్‌కు వేళాయె!

image

రంజాన్ మాసంలో ముస్లింలు ఆచరించే అత్యంత ముఖ్యమైన ఆధ్యాత్మిక క్రతువుల్లో ‘తరావీహ్’ నమాజ్ ఒకటి. తరావీహ్ నమాజ్ ప్రధాన ఉద్దేశం పవిత్ర ఖురాన్ గ్రంథాన్ని పూర్తిగా వినడం. రంజాన్ నెలలో ముప్పై రోజుల పాటు మసీదుల్లో హఫీజ్ నేతృత్వంలో ఈ నమాజ్ జరుగుతుంది. నెల రోజుల్లో ఖురాన్‌లోని 30 అధ్యాయాలను పఠించి పూర్తి చేస్తారు. దీనినే ‘ఖతమ్-ఎ-ఖురాన్’ అంటారు. ఈ రాత్రి నుంచి మసీదుల్లో తరావీహ్ నమాజ్ షురూ అయ్యింది.

News February 18, 2026

బొత్సకు ‘హెరిటేజ్’ లీగల్ నోటీసులు

image

AP: నెయ్యి వివాదంలో వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణకు హెరిటేజ్ సంస్థ లీగల్ నోటీసులు పంపింది. అసత్య, నిరాధార ఆరోపణలతో తమ సంస్థ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు కుట్ర చేస్తున్నారని అందులో పేర్కొంది. తప్పుడు ప్రచారంపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేసింది. కాగా 2014-19లో తిరుమలకు నెయ్యి సరఫరా చేసిన ఇందాపూర్ డెయిరీతో హెరిటేజ్ చీకటి ఒప్పందం చేసుకుందని బొత్స ఆరోపించారు.

News February 18, 2026

నిజామాబాద్: మాజీ MLC ఆర్‌.వెంకట్రామిరెడ్డి సతీమణి కన్నుమూత

image

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ MLC ఆర్.వెంకట్రామ్ రెడ్డి ఇంట్లో విషాదం నెలకొంది. కామారెడ్డి జిల్లా పిట్లం మండలం చిన్నకొడప్గల్‌కు చెందిన ఆయన సతీమణి ఆర్.పుష్పవేణి బుధవారం అనారోగ్యంతో HYDలో కన్నుమూశారు. పుష్పవేణి మృతిపై జిల్లాకు చెందిన పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ, ఉమ్మడి నిజామాబాద్ రాజకీయ నేతలు సంతాపం ప్రకటించారు.