News April 27, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News February 18, 2026
మాదకద్రవ్యాలతో రీల్స్ చేశారు.. అడ్డంగా బుక్ అయ్యారు!

సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం యువత దారి తప్పుతోంది. ఫలక్నుమాకు చెందిన శ్రీచరణ్, విజయ్ కృష్ణ అనే ఇద్దరు యువకులు శివరాత్రి పర్వదినం రోజున మాదకద్రవ్యాలను ప్రదర్శిస్తూ రీల్స్ చేసి నెట్టింట పోస్ట్ చేశారు. గమనించిన పోలీసులు నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై స్పందించిన సీపీ సజ్జనార్, రీల్స్ మత్తులో పడి బంగారు భవిష్యత్తును కటకటాల పాలు చేసుకోవద్దని యువతను హెచ్చరించారు.
News February 18, 2026
ఆస్ట్రేలియా ఔట్.. వరుసగా మూడో సారి!

వరుస ఓటములతో టీ20 WC సూపర్-8 రేసు నుంచి ఆస్ట్రేలియా <<19167885>>నిష్క్రమించడం<<>> తెలిసిందే. సెమీఫైనల్ దాకా చేరకుండా ఆ జట్టు వైదొలగడం వరుసగా మూడో సారి. 2021లో ఆసీస్ ఛాంపియన్‌గా నిలిచింది. కానీ 2022లో సూపర్-12, 2024లో సూపర్-8 దశలోనే ఇంటిదారి పట్టింది. 2024లో అఫ్గాన్ దెబ్బకొడితే, ఈసారి జింబాబ్వే షాకిచ్చింది. దీంతో లీగ్ దశలో ఇంకా ఓ మ్యాచ్ మిగిలి ఉన్నప్పటికీ టోర్నీ నుంచి నిష్క్రమణ తప్పలేదు.
News February 18, 2026
నెల్లూరు జిల్లా రిజిస్ట్రార్‌గా రవి జోసెఫ్

స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ నెల్లూరు జిల్లా రిజిస్ట్రార్‌గా రవి జోసెఫ్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన అల్లూరు సబ్ రిజిస్ట్రార్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు ఆ స్థానంలో ఒంగోలు జిల్లా రిజిస్ట్రార్ బాలాంజనేయులు ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరించారు. నూతన రిజిస్ట్రార్ త్వరలోనే బాధ్యతలు స్వీకరించనున్నారు.


