News April 27, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News February 7, 2026
HYD: ఆమోదాలు.. ఖజానా ఖాళీ చేసేందుకేనా?

GHMC పాలకమండలి తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ నెల 10న పదవీకాలం ముగియనుండగా.. 9న స్టాండింగ్ కమిటీ సమావేశం కానుంది. కొన్ని టేబుల్ అజెండాలను ఆమోదించే అవకాశం ఉంది. అయితే ఒక్కరోజు ముందు ఆమోదించి ఏం అభివృద్ధి చేస్తారో అని ప్రజలు చర్చించుకుంటున్నారు. కానీ లోలోపల మాత్రం టెండర్ల బిల్లులు చెల్లింపు పేరుతో ఖజానా ఖాళీ చేయడానికి కమిటీ సమావేశం అవుతోందని ఆరోపణలు వస్తున్నాయి.
News February 7, 2026
జర్నలిస్టులు అక్రెడిటేషన్లకు దరఖాస్తు చేసుకోవాలి: కలెక్టర్

నిర్మల్ జిల్లాలో 2026-28 సంవత్సరాలకు గాను జర్నలిస్టుల అక్రెడిటేషన్ కార్డుల జారీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. ఈనెల 9 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని శనివారం పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న కార్డుల గడువు ఈనెల 28తో ముగియనుందని, అర్హులైన జర్నలిస్టులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. నిబంధనల ప్రకారం నూతన కార్డులు జారీ చేస్తామని స్పష్టం చేశారు.
News February 7, 2026
ఇస్లామాబాద్‌లో దాడి చేసింది మేమే: ఐసిస్

పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో జరిగిన <<19072203>>ఆత్మాహుతి దాడి <<>>తమ పనేనని ఇస్లామిక్ స్టేట్(ఐసిస్) ప్రకటించింది. ‘మసీదులోకి వెళ్లేందుకు యత్నించిన మా ఫైటర్‌ను గార్డులు అడ్డుకున్నారు. దీంతో ప్రజలు గుమిగూడిన చోట అతడు తనను తాను పేల్చేసుకున్నాడు’ అని ఓ ప్రకటనలో తెలిపింది. అటాక్ చేసిన వారిని చట్టం ముందు నిలబెడతామని పాక్ PM షరీఫ్ ట్వీట్ చేశారు. ఉగ్రవాదాన్ని ఓడించాలనే తమ సంకల్పానికి కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు.


