News April 27, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News February 13, 2026

పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు: సీపీ

image

వరంగల్ కమిషనరేట్ పరిధిలోని ఐదు మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపునకు పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీ బందోబస్తు నిర్వహించాలని సిపి సన్‌ప్రీత్ సింగ్ అధికారులను ఆదేశించారు. కేంద్రంలోకి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించవద్దని, కేవలం అనుమతి పత్రాలు ఉన్నవారినే క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలికి పంపాలని స్పష్టం చేశారు.

News February 13, 2026

బంగ్లాలో BNP విజయం.. మనకెలా లాభం అంటే?

image

బంగ్లాదేశ్‌లో <<19125261>>BNP<<>> గెలవడం భారత్‌కు కొద్దిగా సానుకూల అంశమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరో ప్రధాన పార్టీ ‘జమాతే ఇస్లాం’ పూర్తిగా పాకిస్థాన్‌కు తొత్తు అని, అది గెలిచి ఉంటే సమస్యలు వచ్చి ఉండేవని చెబుతున్నారు. బంగ్లాలో హిందువులపై దాడి వెనుక జమాతేనే కీలక సూత్రధారి అనే ఆరోపణలు ఉన్నాయి. అటు BNP అధినేత తారిఖ్ విద్యావంతుడు కావడంతో పాటు ఏ దేశంలో జోక్యం చేసుకోమని ఇప్పటికే స్పష్టం చేశారు.

News February 13, 2026

సంగారెడ్డి: మైనర్ బాలికపై రేప్.. 20 ఏళ్ల శిక్ష

image

సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలానికి చెందిన వడ్డే రాజు మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో సంగారెడ్డి స్పెషల్ పొక్సో కోర్టు సంచలన తీర్పునిచ్చింది. నేరం నిరూపితం కావడంతో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10,000 జరిమానా విధిస్తూ జడ్జి కె.జయంతి తీర్పు చెప్పారు. నిందితుడికి శిక్ష పడేలా సమర్థవంతంగా పనిచేసిన పోలీసు అధికారులను ఎస్పీ పారితోష్ పంకజ్ ప్రత్యేకంగా అభినందించారు.