News April 27, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News February 7, 2026

నిజామాబాద్: ఎన్‌కౌంటర్‌లో మావోయిస్ట్ హతం

image

ఉమ్మడి NZB జిల్లా ఇస్రోజీవాడి (KMR)కు చెందిన సీనియర్ నక్సలైట్ నాయకుడు, మావోయిస్ట్ పార్టీ గడ్చిరోలి డివిజనల్ కమిటీ ఇన్‌ఛార్జ్ లోకేటి చందర్@ ప్రభాకర్@స్వామి నిన్న గడ్చిరోలి జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో హతమయ్యారు. మూడున్నర దశాబ్దాల క్రితం అప్పటి పీపుల్స్‌వార్‌లో చేరిన ఆయన ఉమ్మడి జిల్లా దళ కమాండర్, జిల్లా కమిటీ సభ్యుడిగా, జిల్లా కార్యదర్శిగా పనిచేశారు. తర్వాత దండకారణ్యానికి వెళ్లారు.

News February 7, 2026

MDK: రాష్ట్రంలోనే మొదటి మున్సిపాలిటీ జిల్లాలోనే!

image

రాష్ట్రంలోనే మొదటి మున్సిపాలిటీ ఏక్కడ ఏర్పాటు అయిందో మీకు తెలుసా? 1952 సంవత్సరంలో సదాశివపేట మున్సిపాలిటీని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 1953లో రాష్ట్రంలో వివిధ మున్సిపాలిటీలను ఏర్పాటు చేస్తూ అప్పటి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అన్ని మున్సిపాలిటీలతో పాటు అదే సంవత్సరం సదాశివపేటకు కూడా మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. రాష్ట్రంలోనే మొదటి మున్సిపాలిటీగా పేరు దక్కించుకుంది.

News February 7, 2026

నాణ్యతతోనే అధిక ధర: మార్కెట్ కార్యదర్శి జయలక్ష్మి

image

కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో కార్యదర్శి జయలక్ష్మి నాణ్యత తనిఖీలు నిర్వహించారు. ఒక రైతు తెచ్చిన వాము సరుకులో మట్టి, పొట్టు ఉండటంతో మొదట క్వింటాల్‌కు రూ.11,000 మాత్రమే ధర పలికింది. అధికారుల సూచనతో రైతు సరుకును శుభ్రపరచగా, అదే వాముకు క్వింటాల్‌కు రూ.24,000 ధర లభించింది. సరుకును శుభ్రపరిచి విక్రయిస్తే రెట్టింపు ధర లభిస్తుందని, రైతులు నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ఆమె సూచించారు.