News April 27, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News February 18, 2026

సదాశివనగర్: విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరీక్షించిన కలెక్టర్

image

సదాశివనగర్ మండలం తీర్మన్‌పల్లి ప్రాథమిక పాఠశాలను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ బుధవారం సందర్శించారు. తరగతి గదులకు వెళ్లిన కలెక్టర్.. విద్యార్థుల చదవడం, రాయడం, ఇంగ్లిష్, గణితం వంటి అభ్యాస సామర్థ్యాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. 100 శాతం హాజరు సాధించిన విద్యార్థులను అభినందించి, వారికి నోట్ బుక్స్, పెన్నులు అందజేశారు. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు.

News February 18, 2026

పార్వతీపురం: ‘సీఎస్సీ పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు’

image

పార్వతీపురం జిల్లాలో మంజూరైన కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్సుల నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని, త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం సీఎస్సీల నిర్మాణాలపై సమావేశం ఏర్పాటు చేశారు. గ్రామ స్థాయిలో మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి పనులను నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలన్నారు.

News February 18, 2026

కొచ్చిన్ యూనివర్సిటీలో టెక్నికల్ పోస్టులు

image

<>కొచ్చిన్ <<>>యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో 7 పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. ఐటీఐ, డిప్లొమా, BSc(MPC/CS)అర్హత గలవారు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు హార్డ్ కాపీని ఫిబ్రవరి 28వరకు పంపాలి. వయసు 18 నుంచి 36ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. టెక్నీషియన్‌కు నెలకు రూ.22,240, టెక్నికల్ అసిస్టెంట్‌కు రూ.31,020 చెల్లిస్తారు. https://recruit.cusat.ac.in