News April 27, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News February 10, 2026
కపిలతీర్థం: Photo Of The Day

తిరుపతిలోని కపిలతీర్థంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం భూత వాహనంపై శ్రీకామాక్షి సమేత సోమస్కందమూర్తి దర్శనం ఇచ్చారు. ఆలయ పరిసరాల్లో స్వామివారిని ఊరేగించారు. కపిలతీర్థం సర్కిల్ వద్ద స్వామివారు, శివలింగం ఒకే ఫ్రేమ్‌లో కనపడేలా తీసిన ఫొటో వైరలవుతోంది.
News February 10, 2026
పాక్ యూటర్న్ విలువ ₹1,500 కోట్లు!

భారత్‌తో మ్యాచ్ బాయ్‌కాట్‌పై పాక్ యూటర్న్ తీసుకోవడంతో ICC సహా గ్లోబల్ బ్రాడ్‌కాస్టర్లకు దాదాపు ₹1,500 కోట్ల ఆదాయం మిగిలింది. మ్యాచ్ రద్దయి ఉంటే మీడియా పార్ట్‌నర్ అయిన జియోహాట్‌స్టార్‌కు ICC భారీ పరిహారం ఇవ్వాల్సి వచ్చేది. అలాగే 10 సెకన్ల యాడ్‌కు ₹25-40 లక్షల చొప్పున సుమారు ₹200-300 కోట్ల యాడ్ రెవెన్యూ పోయేది. స్పాన్సర్‌షిప్‌లు, డిజిటల్ ట్రాఫిక్, హోటల్ బుకింగ్‌ల రూపంలో మరింత లాస్ తప్పేది కాదు.
News February 10, 2026
KMR: ఓటేయడానికి వెళ్తున్నారా..! ఇవి తప్పనిసరి

కామారెడ్డి, బాన్సువాడ, బిచ్కుంద, ఎల్లారెడ్డి మున్సిపాలిటీల్లో రేపు పోలింగ్ జరగనుంది. ఈ సందర్భంగా ఓటేసి ప్రతి ఓటరు ఏదైనా గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. ఓటరు కార్డు, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, ఉపాధి హమీ జాబ్ కార్డ్, ఇండియన్ పాస్ పోర్ట్, బ్యాంక్ ఖాతా బుక్, పోస్టాఫీసు ఖాతా బుక్ ఇలా 18రకాల గుర్తింపు కార్డులలో ఏదో ఒకటి తీసుకెళ్లాలని తెలిపారు.


