News April 27, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News February 7, 2026

పెళ్లిళ్లలో సంగీతం వాయించేవాడిని: అనిరుధ్

image

ఒక్కో సినిమాకు రూ.కోట్లు తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ తన చిన్నతనంలో పెళ్లి వేడుకల్లో సంగీతం వాయించేవారు. అప్పుడు తనకు రూ.500 ఇచ్చేవారని, కొన్నిసార్లు తాంబూలం ఇచ్చి పంపేవారని ఆయన ఓ ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నారు. ‘ఆ తక్కువ డబ్బుతో పొందిన సంతోషం ఇప్పుడు రూ.కోట్లు వస్తున్నా కలగడం లేదు’ అని ఆయన చెప్పుకొచ్చారు. కష్టపడే తత్వం ఉంటే సున్నా నుంచి శిఖరానికి చేరవచ్చని అనిరుధ్ నిరూపించారు.

News February 7, 2026

ఉయ్యూరు శిడిబండి పెళ్లికొడుకు ఇతనే..!

image

ఉయ్యూరులో శనివారం శిడిబండి నిర్వహించనున్నారు. గ్రామానికి చెందిన ఓ యువకుడిని బుట్టలో కూర్చోబెట్టి 3సార్లు తిప్పడం ఆనవాయితీగా వస్తుందని నిర్వాహకులు తెలిపారు. ఈ ఏడాది శిడిబండి పెళ్లికొడుకుగా CRPF మేజర్ శివ నాగరాజు కుమారుడు ఉయ్యూరు విక్రమ్ సింహని కూర్చోబెట్టనున్నారు. బండి కదిలే సమయంలో భక్తులు బుట్టపై అరటికాయలు విసురుతూ భక్తిని చాటుకోనున్నారు.

News February 7, 2026

వంటింటి చిట్కాలు

image

* పనీర్ ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే బ్లాటింగ్ పేపర్‌లో పెట్టి ఫ్రిజ్‌లో ఉంచండి. * సింక్ గొట్టంలో ఆహార వ్యర్థాలు ఇరుక్కుపోయి దుర్వాసన వస్తుంటే బేకింగ్ సోడాను వేడినీళ్ళలో కలిపి పోస్తే సమస్య పరిష్కారమవుతుంది. * కొబ్బరిపాలు కొన్ని గంటలపాటు తాజాగా ఉండాలంటే చిటికెడు ఉప్పు కలపండి. * కొత్తిమీర కాడల్ని కత్తిరించి ఆ ఆకులకు నాలుగైదు వరుసల్లో కాగితాలు చుట్టి ఫ్రిజ్‌లో ఉంచితే ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది.