News April 27, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News February 9, 2026

పార్వతీపురం: ఫేర్వెల్ ముసుగులో అశ్లీల నృత్యాలు.. వార్డెన్ సస్పెండ్

image

కురుపాం మండలం నీలకంఠాపురం గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత బాలుర పాఠశాలలో ఫేర్వెల్ డే సందర్భంగా <<19082399>>అశ్లీల<<>> నృత్యాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు మండిపడ్డాయి. మంత్రులు లోకేశ్, సంధ్యారాణి, కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు దర్యాప్తు చేశామని DD విజయశాంతి తెలిపారు. ITDA PO ఆదేశాల మేరకు సంబంధిత వార్డెన్‌‌ చంద్రమోహన్‌ను సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు.

News February 9, 2026

నాలుగు రోజులు సెలవులు!

image

TG: ఈ వారంలో పలు జిల్లాల్లో స్కూళ్లకు నాలుగు రోజులు హాలిడేస్ ఉండే అవకాశముంది. ఎల్లుండి(11) పోలింగ్ జరిగే ప్రాంతాల్లో సెలవులు ప్రకటించాలని ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేశారు. లెక్కింపు రోజైన 13న కూడా ఆయా స్కూళ్లు, కార్యాలయాలకు హాలిడేస్ ఉండనున్నాయి. మరుసటి రోజు రెండో శనివారం కాగా తదుపరి ఆదివారం కావడంతో వరుస సెలవులు రానున్నాయి. మరోవైపు ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో వైన్ షాపులు <<19086702>>బంద్<<>> ఉండనున్నాయి.

News February 9, 2026

అమరావతిలో ఏఐ యూనివర్సిటీ!

image

AP: అమరావతిలో ఏఐ యూనివర్సిటీ ఏర్పాటు కాబోతోంది. ఏఐ ఎకో సిస్టమ్, మౌలిక సదుపాయాల కల్పన, శిక్షణ కేంద్రాల ఏర్పాటుకు వీలుగా రాష్ట్ర ఐటీ శాఖ జీవో జారీ చేసింది. ఏఐ లివింగ్ ల్యాబ్స్ పేరుతో వర్సిటీ ఏర్పాటుకు ప్రభుత్వంతో ఎన్‌విడియా కంపెనీ గతంలో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ క్రమంలో ఈ నెల 19 నుంచే వర్సిటీ కార్యకలాపాలు ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే దేశంలోనే తొలి ఏఐ వర్సిటీగా నిలవనుంది.