News April 27, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News February 18, 2026

ఇంటర్వ్యూతో హైదరాబాద్ ECILలో ఉద్యోగాలు

image

HYDలోని <>ECIL<<>> 18 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి FEB 20న ఇంటర్వ్యూ నిర్వహించనుంది. పోస్టును బట్టి PG, PGDM(మెటీరియల్ మేనేజ్‌మెంట్, సప్లై చైన్ మేనేజ్‌మెంట్, BE/BTech అర్హతతో పాటు పని అనుభవం గలవారు ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు (రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు). DV, షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు రూ.40K చెల్లిస్తారు. సైట్: www.ecil.co.in/

News February 18, 2026

షాద్‌నగర్ యాక్సిడెంట్‌లో చనిపోయింది వీరే..!

image

షాద్‌నగర్ సమీపంలోని రాయికల్ టోల్ ప్లాజా వద్ద <<19172176>>అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం<<>> జరిగిన విషయం తెలిసిందే. కాగా, అరుణాచలం నుంచి HYD తిరిగి వస్తుండగా గుర్తుతెలియని వాహనం ఇన్నోవా క్రిస్టాను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తుర్కయంజాల్‌కు చెందిన పురుషోత్తం రెడ్డి, మధుసూదన్ రెడ్డి అక్కడికక్కడే మృతిచెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడగా, వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘనటపై పోలీసులు కేసు నమోదు చేశారు.

News February 18, 2026

రాష్ట్రంలో నేటి నుంచి శనగల కొనుగోళ్లు ప్రారంభం

image

AP: రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి శనగల కొనుగోళ్ల ప్రక్రియ ప్రారంభంకానుంది. రబీలో 3.25 లక్షల హెక్టార్లలో పంట సాగవగా.. 3.77 లక్షల టన్నుల ఉత్పత్తి వస్తుందని ప్రభుత్వ అంచనా. కేంద్రం ఆదేశాలతో కనీస మద్దతు ధరల పథకం కింద 94,500 టన్నుల శనగలను కొనుగోలు చేయనున్నారు. పంట అమ్మకానికి అన్నదాతలు రైతు సేవా కేంద్రాలను సంప్రదించాలని, పంట కొనుగోలు చేసిన 15 రోజుల్లో నగదు చెల్లిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.