News April 27, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News February 18, 2026
ఈక్రాప్ నమోదును వేగంగా పూర్తి చేయాలి: నెల్లూరు కలెక్టర్

ఈ క్రాప్ నమోదును వేగంగా పూర్తిచేయాలని నెల్లూరు కలెక్టర్ హిమాన్షు శుక్లా వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. ఇందుకూరుపేట మండలం కొరుటూరు పంచాయతీలో ఆన్‌లైన్‌లో నమోదు చేసిన పంట వివరాలను కలెక్టర్ పరిశీలించారు. ఈ-పంట యాప్ నుంచి రైతుల వివరాలను డౌన్లోడ్ చేసుకొని నమోదు చేసేటప్పుడు ఆధార్ ఫోన్ నెంబర్ సరిచూడాలన్నారు. రైతు గండవరపు అమర్నాథ్ రెడ్డి, గ్రామ వ్యవసాయ సహాయకురాలు ఝాన్సీ పాల్గొన్నారు.
News February 18, 2026
NZB: పసుపు రైతు అభివృద్ధే దేశాభివృద్ధి: పసుపు బోర్డు ఛైర్మన్

పసుపు రైతుల అభివృద్ధే దేశాభివృద్ధి అని జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్ పల్లె గంగారెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఢిల్లీలో టర్మరిక్ బోర్డు మీటింగ్‌లో ఆయన పాల్గొన్నారు. దేశంలోని పసుపు రైతుల సంక్షేమం, ఎగుమతుల విస్తరణ, అంతర్జాతీయ మార్కెట్‌లో భారత పసుపు బ్రాండ్ బలోపేతం వంటి అంశాలపై చర్చించినట్లు ఆయన తెలిపారు. పసుపు రైతుల భవిష్యత్తు బలోపేతం కావాలంటే ప్రభుత్వ, రైతు, వ్యాపార వర్గాల సమన్వయం అత్యవసరమని అన్నారు.
News February 18, 2026
జగిత్యాల: ‘ఉపాధి కల్పన కార్డుకు నమోదు చేసుకోవాలి’

విద్యార్థులు ఉపాధి కల్పన కార్డుకు నమోదు చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పన అధికారి సత్యమ్మ పేర్కొన్నారు. జగిత్యాల ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో కెరీర్ గైడెన్స్, ఉపాధి కల్పన కార్డు నమోదు కార్యక్రమంపై బుధవారం విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులకు భవిష్యత్తులో ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించారు. సిబ్బంది లైన కుమారి, ప్రసన్న, సదానందం లు రిజిస్ట్రేషన్ ప్రక్రియను విద్యార్థులకు చూపించారు.


