News April 27, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News February 13, 2026

మూడేళ్ల పోరాటం.. విజయవార్త వినకుండానే..

image

‘ఆమె ప్రాణాలకు విలువలేదు’ అనే దుర్మార్గపు మాటపై USలో మూడేళ్లుగా న్యాయపోరాటం చేసిన కందుల జాహ్నవి తండ్రి 2 రెండు రోజుల కిందటే గుండెపోటుతో చనిపోయారు. రూ.262 కోట్ల పరిహారం <<19117214>>ఇచ్చేందుకు<<>> సియాటెల్ విభాగం నిన్నే ఒప్పందం చేసుకుంది. కేసులో విజయం సాధించిన వార్త వినకముందే తండ్రి శ్రీకాంత్ చనిపోయారు. వీరిది కర్నూలు(D) కుంభళనూరు క్యాంప్ గ్రామం. ఉన్నతవిద్య కోసం US వెళ్లిన జాహ్నవి పోలీస్ వాహనం ఢీకొని చనిపోయారు.

News February 13, 2026

తూ.గో: గురుకులాల్లో ప్రవేశాలకు ఆహ్వానం.. చివరి తేదీ ఎప్పుడంటే?

image

ఉమ్మడి తూ.గో. జిల్లాలోని గురుకుల విద్యాలయాలలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను 5వ తరగతి నుంచి జూనియర్ ఇంటర్ వరకు నూతన ప్రవేశాలకు విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని ఉమ్మడి తూ.గో జిల్లా సమన్వయ అధికారి రాజకుమారి సూచించారు. 6 నుంచి 10 తరగతుల వరకు ఉన్న ఖాళీలకు బాలురు, బాలికల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు ఆమె తెలిపారు. https://apgpcet.apcffss.in ఆన్‌లైన్‌లో ఈనెల 19 లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News February 13, 2026

శ్రీహరికోటలో CISF డీజీపీ ఇన్స్పెక్షన్

image

శ్రీహరికోటలోని ISRO కేంద్రానికి CISF డీజీపీ ప్రవీరం రాజన్ గురువారం రాత్రి జనరల్ ఇన్స్పెక్షన్ విజిట్‌లో భాగంగా చేరుకున్నారు. సీనియర్ అధికారులు, సిబ్బంది ఆయనకు స్వాగతం పలికారు. భద్రతా ఏర్పాట్లు, విధుల్లో ఉన్న యూనిట్ల పనితీరు, సిబ్బంది అప్రమత్తతను సమీక్షించనున్నారు. అంతరిక్ష కేంద్ర భద్రతను మరింత బలోపేతం చేయడంపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు.