News April 27, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News February 17, 2026
ADB: హంగ్ మున్సిపాలిటీలకు కాంగ్రెస్ ఇన్‌ఛార్జుల నియామకం

ఉమ్మడి ఆదిలాబాద్‌లో ఎన్నికలు వాయిదా పడ్డ మూడు మున్సిపాలిటీలకు TPCC అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్ ఇన్‌ఛార్జులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. క్యాతన్‌పల్లి మున్సిపాలిటీకి మంత్రి పొన్నం ప్రభాకర్, MLA కే. సత్యనారాయణను, ఖానాపూర్‌కు MLAలు శ్రీనివాస్, భూపతిరెడ్డిని, కాగజ్ నగర్‌కు ప్రభుత్వ సలహాదారు పీ.సుదర్శన్ రెడ్డి, MLA కే.ప్రేంసాగర్ రావును నియమించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
News February 17, 2026
కనుబొమ్మలు ఒత్తుగా పెరగాలంటే?

కొందరిలో కనుబొమ్మలు చాలా పలుచగా ఉంటాయి. వాటిని పెంచడానికి ఈ టిప్స్..* కనుబొమ్మలపై రోజూ ఆముదం నూనెను రాయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. * తాజా కలబంద జెల్ ను కనుబొమ్మలపై రాసి 30 నిమిషాల పాటు అలాగే ఉంచి తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజూ రెండు సార్లు చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. * కొబ్బరి నూనెలో రోజ్‌మేరీ నూనెను కలిపి కనుబొమ్మలపై మర్దనా చేస్తే ఒత్తుగా పెరుగుతాయి.
News February 17, 2026
‘ఫర్టిగేషన్’తో సాగులో మరిన్ని లాభాలు

నీటితో పాటు ద్రవరూపంలో ఉన్న ఎరువులను నిర్ణీత మోతాదులో కలిపి డ్రిప్ ద్వారా మొక్కలకు అందించే విధానాన్ని ‘ఫర్టిగేషన్’ అంటారు. ఈ విధానంలో నీటిలో కరిగే రసాయన, సేంద్రియ ఎరువులను మాత్రమే వాడాలి. పండ్లు, కూరగాయలు, పూల తోటలతో పాటు పత్తి, చెరకు, అరటి, మిరప, ఔషధ మొక్కల సాగుకు ఇది అనుకూలం. ఫర్టిగేషన్‌లో తక్కువ నీటితో సరైన మోతాదులో ఎరువులను అందించి లాభసాటి వ్యవసాయం చేయవచ్చని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు.


