News April 27, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News February 19, 2026

మదనపల్లె మృగాడికి మరణం తర్వాతా శిక్ష

image

AP: అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఆత్మహత్య చేసుకున్న కులవర్ధన్ మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు కుటుంబం నిరాకరించింది. నిన్న పోస్టుమార్టం రిపోర్టుపై సంతకానికి సైతం రాకపోవడంతో అతడి పెదనాన్న సమ్మతితో ప్రక్రియ పూర్తి చేశారు. ఇప్పుడు బాడీ కోసం ఎవరూ రాకపోవడంతో అనాథ శవంగా మున్సిపాలిటీ సిబ్బంది ఖననం చేయనున్నారు. కాగా 7సం.ల చిన్నారిపై హత్యాచారానికి పాల్పడ్డ కులవర్ధన్, శిక్ష భయంతో చెరువులో దూకి చనిపోయాడు.

News February 19, 2026

తూ.గో: దారుణం.. భార్యను కిరాతకంగా చంపిన భర్త

image

బిక్కవోలు మండలం రంగాపురంలో బుధవారం అర్ధరాత్రి దారుణం జరిగింది. దొనకొండ జ్యోతి(28)ని ఆమె భర్త దుర్గయ్య దాడి చేసి చంపాడని స్థానికులు తెలిపారు. గత ఐదేళ్లుగా వీరిద్దరి మధ్య ఉన్న మనస్పర్ధలే ఇందుకు కారణమని తెలుస్తోంది. జ్యోతి మృతి చెందిన అనంతరం దుర్గయ్య పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News February 19, 2026

చిన్న వయసులోనే తల నెరుస్తోందా?

image

చర్మంలో మెలనిన్‌ ఉత్పత్తి తగ్గినప్పుడు తెల్లవెంట్రుకలు కనిపిస్తాయి. ఇది వృద్ధాప్యచిహ్నం. కానీ ప్రస్తుతం చాలామందికి చిన్నవయసులోనే తల నెరుస్తోంది. హార్మోనుల్లో అసమతుల్యత, అనారోగ్యకర జీవన శైలి, కాలుష్యం, రసాయనాలున్న, సింథటిక్‌ షాంపూలు వాడటం దీనికి కారణం అంటున్నారు నిపుణులు. గోధుమ, పెరుగు, టొమాటో, అరటి, చిరుధాన్యాలు, గుడ్డు, చేప, సీఫుడ్‌, సోయాలను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు.