News April 27, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News February 16, 2026
మద్దూరు మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా ఢిల్లీ కార్ సరస్వతి!

మద్దూరు మున్సిపాలిటీ నూతన ఛైర్‌పర్సన్‌గా ఢిల్లీ కార్ సరస్వతి జనార్దన్(16వ వార్డు), వైస్ ఛైర్‌పర్సన్‌గా భాగ్యశ్రీ(6వ వార్డు) సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. 16 వార్డులకు గాను 9 స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థులు ఆమెకు మద్దతు తెలిపారు. అధికారుల సమక్షంలో పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం, పట్టణ సమగ్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఆమె ప్రకటించారు.
News February 16, 2026
నాగర్‌కర్నూల్ మున్సిపల్ ఛైర్మన్‌గా తీగల సునేంద్ర!

నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీ పురపీఠాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఛైర్మన్‌గా తీగల సునేంద్ర, వైస్ ఛైర్మన్‌గా బాదం రమేశ్ ఎన్నికయ్యారు. ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి, అధికారుల సమక్షంలో వీరిద్దరూ అధికారికంగా పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. నూతన పాలకవర్గానికి పార్టీ శ్రేణులు, అధికారులు ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు.
News February 16, 2026
కొత్తగూడెంలో ‘ఎర్రదండు’ కార్పొరేటర్లు..!

కొత్తగూడెం మేయర్ ఎన్నిక వేళ సీపీఐ కార్పొరేటర్లు సరికొత్తగా మెరిశారు. ఎర్రజెండా సిద్ధాంతానికి ప్రతీకగా ఆ పార్టీకి చెందిన 22 మంది కార్పొరేటర్లు ఎర్రటి చీరలు, ఎర్ర చొక్కాలు ధరించి ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. కార్పొరేషన్ కార్యాలయం అంతా ఎరుపు రంగుతో నిండిపోవడంతో కార్యకర్తలు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు. ఎర్రదళం రాకతో కొత్తగూడెం కార్పొరేషన్ ప్రాంగణంలో పండగ వాతావరణం నెలకొంది.


