News April 27, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News February 18, 2026

కర్నూలు: 9 మంది డిబార్

image

రాయలసీమ యూనివర్సిటీ పరిధిలో బుధవారం జరిగిన పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ చేస్తూ 9మంది విద్యార్థులు పట్టుబడ్డారని రిజిస్ట్రార్ విజయకుమార్ తెలిపారు. ఆలూరు జ్యోతిర్మయి కళాశాలలో ముగ్గురు, నంద్యాల ప్రభుత్వ కళాశాలలో ఇద్దరు పట్టుబడ్డారు. ఎమ్మిగనూరు రావూస్, డోన్ జీడీఎస్, ఆత్మకూరు వెంకటేశ్వర, కర్నూలు నందనం కళాశాలల్లో ఒక్కొక్కరు చొప్పున డిబార్ అయ్యారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

News February 18, 2026

నెల్లూరు: ఆ 6 గ్రామాల్లో సోలార్ సిస్టం

image

‘పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన’ కింద నెల్లూరు జిల్లాలో ఆరు పల్లెలను మోడల్ సౌర గ్రామాలుగా అభివృద్ధి చేస్తామని కలెక్టర్ హిమాన్షు శుక్లా ప్రకటించారు. తన ఛాంబర్‌లో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో తొలి విడతగా లేగుంటపాడు, బిట్రగుంట, మహిమలూరు, కలివేలపాలెం, మనుబోలు, కాకుపల్లిలో సోలార్ సిస్టం ఏర్పాటు చేస్తామని చెప్పారు. విద్యుత్తు ఆదాతో పాటు ప్రజలకు ఆదాయం వస్తుందన్నారు.

News February 18, 2026

కామారెడ్డి: టెన్త్ పాసయ్యారా? మీ కోసమే..!

image

కామారెడ్డిలోని స్థానిక కలెక్టర్ కార్యాలయంలో ఈనెల 20వ తేదీ (శుక్రవారం) జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి కిరణ్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రైవేట్ రంగంలో ఉపాధి కల్పనకు జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు చెప్పారు. అభ్యర్థులు టెన్త్ చదివి ఉండాలని, 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయసు ఉండాలని, ఆసక్తి ఉన్న నిరుద్యోగులు జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. SHARE IT