News April 27, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News February 15, 2026

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు వరుసగా 3 రోజులు సెలవులు

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు వరుసగా మూడు రోజుల పాటు సెలవులు ప్రకటిస్తున్నట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. ఆదివారం వారాంతపు సెలవుతో పాటు, సోమవారం (16-02-2026) మహాశివరాత్రి, మంగళవారం అమావాస్య సందర్భంగా మార్కెట్ లావాదేవీలు నిలిపివేయనున్నారు. తిరిగి బుధవారం నుంచి మార్కెట్ యథావిధిగా పనిచేస్తుందని పేర్కొన్నారు. రైతులు ఈ విషయాన్ని గమనించి, క్రయవిక్రయాల కోసం బుధవారం మార్కెట్‌కు రావాలని అధికారులు కోరారు.

News February 15, 2026

కొత్తగూడెం కార్పొరేషన్.. CPI, కాంగ్రెస్ పొత్తు

image

TG: కొత్తగూడెం కార్పొరేషన్‌పై ఉత్కంఠ వీడింది. చెరో రెండున్నరేళ్లు మేయర్ పదవిని పంచుకోవాలని సీపీఐ-కాంగ్రెస్ అంగీకారానికి వచ్చాయి. తొలుత సీపీఐ నుంచి మేయర్‌, కాంగ్రెస్ నుంచి డిప్యూటీ మేయర్ ఉండాలని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, సీపీఐ నేతలు పల్లా వెంకట్ రెడ్డి, ఈటీ నర్సింహ నిర్ణయించారు.

News February 15, 2026

రేపు శైవ క్షేత్రాల్లో మంత్రి కొండా సురేఖ పర్యటన

image

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం వరంగల్ పలు శైవ క్షేత్రాల్లో జరిగే వేడుకల్లో మంత్రి కొండా సురేఖ పాల్గొననున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు దేశాయిపేట రాజరాజేశ్వర ఆలయం, కాశీబుగ్గ విశ్వేశ్వర స్వామి ఆలయాలను ఆమె దర్శిస్తారు. అనంతరం ఖిలా వరంగల్ స్వయంభూ శంభులింగేశ్వర స్వామి, శివనగర్ రామాలయం, దుర్గేశ్వర స్వామి దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.