News April 27, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News February 13, 2026
BREAKING: సూర్యాపేట ‘హస్త’గతం!

సూర్యాపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్ విజయకేతనం ఎగురవేసింది. మొత్తం 48 వార్డులకు గాను 31 చోట్ల ఘన విజయం సాధించి ఛైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ 11 స్థానాలకే పరిమితం కాగా, స్వతంత్రులు 5, బీజేపీ 1 చోట గెలుపొందాయి. ఈ భారీ విజయంతో కాంగ్రెస్ శ్రేణుల బాణసంచా పేలుళ్లు, మిఠాయిల పంపిణీతో జిల్లా కేంద్రంలో పండుగ వాతావరణం నెలకొంది.
News February 13, 2026
GNT: తగ్గేదే’లే’ VS వదిలేదే’లే’.. పరిస్థితి ఎటుపోతుందో?

మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఈ నెల 26 వరకు కోర్టు రిమాండ్ విధించింది. ఇప్పటికే రెండు కేసుల్లో బెయిల్ లభించినప్పటికీ మరో కేసు నేపథ్యంలో ఆయన రిమాండ్‌కు వెళ్లారు. కోర్టు ప్రాంగణంలో ‘తగ్గేదేలే’ అన్నట్టు సైగ చేయడం చర్చనీయాంశమైంది. ఇదే సమయంలో టీడీపీ నేతలు వరుస కేసులు నమోదుతో వదిలేదే ‘లే’ అన్నట్లు ఉంది. కేసులు ఇక్కడితో ఆగుతాయా లేదా కొనసాగుతాయా అన్నది జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై మీ COMMENT?
News February 13, 2026
అసలు చీరాలలో ఏం జరుగుతోంది..?

మినీ ముంబైగా పిలిచే చీరాల నియోజకవర్గం గురించి జిల్లా ప్రజల్లో ఆసక్తికర విషయాలు రేకెత్తుతున్నాయి. బుధ, గురువారం YCP, TDP నేతలు చీరాల అభివృద్ధిపై చర్చలకు సిద్ధమా అంటూ సవాల్ విసురుకున్నారు. రైల్వే, జీడిపప్పు, వస్త్ర పరిశ్రమలు, వ్యవసాయం, పర్యాటక రంగం నుంచి అనేక రకాలుగా చీరాలకు ఆదాయం చేకూరుతోంది. ఈ ఆదాయంతో YCP, కూటమి ప్రభుత్వం నిజంగానే చీరాలను అభివృద్ధి చేశాయా..? అని ప్రజలు చర్చించుకుంటున్నారు.


