News April 27, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News February 17, 2026

భారత్‌తో ఓటమి.. నఖ్వీ కోపానికి పాక్ కోచ్ బలి?

image

టీమ్‌ఇండియా చేతిలో ఓటమి తర్వాత పాక్ కోచ్ మైక్ తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్లు తెలుస్తోంది. కొలంబోలోని ప్రసిద్ధ ‘క్రికెట్ క్లబ్ కేఫ్’లో ఆయన కనిపించిన దృశ్యాలు SMలో వైరలవుతున్నాయి. డ్రెస్సింగ్ రూమ్‌లో ఆటగాళ్లు, మేనేజ్‌మెంట్‌పై PCB ఛైర్మన్ నఖ్వీ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. రేపు నమీబియాతో మ్యాచ్‌లో పాక్ ఓడిపోతే ఆ జట్టు ఇంటికెళ్లాల్సిందే. ఈ తరుణంలో కేఫ్‌లో మైక్ కనిపించడం చర్చకు దారితీసింది.

News February 17, 2026

జగిత్యాల: 100% ఓటరు జాబితా సవరణే లక్ష్యం: కలెక్టర్

image

జగిత్యాల జిల్లాలో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (Special Intensive Revision) ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొన్నారు. ఇంటింటి సర్వేతో ఖచ్చితమైన వివరాలు సేకరించాలని, బూత్ లెవల్ అధికారులు (BLO) క్షేత్రస్థాయిలో పర్యటించి తప్పులు లేకుండా మ్యాపింగ్ చేయాలని సూచించారు.

News February 17, 2026

బాపట్ల: కుమార్తెకు వేధింపులు.. నిలదీసిన తల్లిపై కొడవలితో దాడి!

image

తన కుమార్తె పట్ల అసభ్యంగా ప్రవర్తించావని నిలదీసినందుకు ఓ మహిళపై కత్తితో దాడిచేసిన ఘటన నడింపల్లిలో జరిగింది. గ్రామానికి చెందిన వాకా సత్యనారాయణ అదే గ్రామానికి చెందిన సామ్రాజ్యం కుమార్తెను వేధించాడు. పొలంలో గడ్డి కోస్తున్న అతడిని సామ్రాజ్యం ప్రశ్నించగా, తన వద్ద ఉన్న కొడవలితో ఆమెపై దాడికి తెగబడ్డాడని బాధితులు వాపోయారు. సామ్రాజ్యం చేతివేళ్లు తెగగా, 15కుట్లు పడినట్లు తెలిపారు. వివరాలు తెలియాల్సి ఉంది.