News April 27, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News February 10, 2026
కొడంగల్‌కు సీఎం రేవంత్

TG: CM రేవంత్ రేపు కొడంగల్‌లో పర్యటించనున్నారు. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఉ.11.30గం.కు కొడంగల్‌లోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అనంతరం HYDకు తిరిగి పయనమవుతారు. రేపు రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు పోలింగ్ జరగనుంది. 8,203 కేంద్రాలు, 16,301 బ్యాలెట్ బాక్సులను EC సిద్ధం చేసింది. మొత్తం 12,930మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
News February 10, 2026
స్ట్రాంగ్ రూమ్స్, కౌంటింగ్ సెంటర్లను పరిశీలించిన కలెక్టర్

మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల సాధారణ ఎన్నికలు 2026లో భాగంగా మేడ్చల్ జిల్లాలోని మూడుచింతలపల్లి, ఆలియాబాద్, ఎల్లంపేట్ మున్సిపాలిటీలలో ఎన్నికలకు ఉపయోగించే సామగ్రి డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను సాధారణ ఎన్నికల పరిశీలకులు నిర్మల కాంతి వెస్లీతో కలిసి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మనూ చౌదరి పరిశీలించారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్లతోపాటు స్ట్రాంగ్ రూమ్స్, కౌంటింగ్ సెంటర్ల ఏర్పాట్లను తనిఖీ చేశారు.
News February 10, 2026
వైరా: మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లపై సీపీ నిఘా

వైరా మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో CP సునీల్ దత్ మంగళవారం పట్టణంలో పర్యటించారు. ముందుగా వైరాలోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను సందర్శించి, ఎన్నికల సామగ్రి పంపిణీ, భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న సీపీ.. ఎన్నికల వేళ శాంతిభద్రతల పరిరక్షణపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.


