News April 27, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News February 10, 2026
పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో అధునాతన శస్త్ర చికిత్సలు

జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో సుల్తానాబాద్‌కు చెందిన 50 సంవత్సరాల మహిళకు గర్భాశయం ముఖ ద్వారం వద్ద ఏర్పడిన గడ్డను మంగళవారం సర్జరీ ద్వారా తొలగించినట్లు సూపరింటెండెంట్ డా.శ్రీధర్ తెలిపారు. అలాగే ఓదెలకు చెందిన ఇద్దరు మహిళలకు లాపరోస్కోపిక్ సర్జరీ ద్వారా గాల్ బ్లాడర్ నెక్‌లోని స్టోన్ తొలగించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా సర్జరీలో పాల్గొన్న డాక్టర్ల బృందాన్ని ఆయన అభినందించారు.
News February 10, 2026
SVU : డిగ్రీ పూర్వ విద్యార్థులకు లాస్ట్ ఛాన్స్

SVU పరిధిలో (UG) డిగ్రీ మొదటి, రెండవ, మూడవ సంవత్సర ఇయర్ ప్యాటర్న్ ( వార్షిక పరీక్షలు) ఈనెల 26వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని పరీక్షల విభాగం నియంత్రణ అధికారి రాజమాణిక్యం పేర్కొన్నారు. పూర్వ విద్యార్థులకు ఇది చివరి అవకాశం అని పేర్కొన్నారు. ఇయర్ ప్యాటర్న్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ID ప్రూఫ్/ ఆధార్ ఒరిజినల్ తీసుకుని విశ్వవిద్యాలయంలో ఈనెల 20వ తేదీ నుంచి హాల్ టికెట్స్ పొందవచ్చని సూచించారు.
News February 10, 2026
కేంద్ర రైల్వేశాఖ మంత్రితో ఎంపీ శ్రీ భరత్ భేటీ

కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను విశాఖ ఎంపీ శ్రీ భరత్ మంగళవారం పార్లమెంట్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. విశాఖ రైల్వే జోన్ కోసం చర్చించారు. హైదరాబాద్, బెంగళూరు, తిరుపతి, చెన్నై, విజయవాడ వంటి అధిక డిమాండ్ ఉన్న మార్గాల్లో రైళ్ల కొరత ఉందని తెలియజేస్తూ, ఆయా మార్గాల్లో కొత్త వందే భారత్ స్లీపర్ రైళ్లను ప్రారంభించాలని కోరారు. విశాఖ మీదుగా ప్రయాణించే రైళ్లకు అత్యవసర కోటాను పెంచాలన్నారు.


