News April 27, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News February 10, 2026
SRPT: మున్సిపల్ పోరుకు సర్వం సిద్ధం: కలెక్టర్

సూర్యాపేట జిల్లాలోని 5 మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ తెలిపారు. 141 వార్డుల్లో 2,232 మంది సిబ్బందితో పోలింగ్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ జరుగుతుందని, ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన కోరారు.
News February 10, 2026
ADB: ఓటర్లకు కాసులపంటే..!

మున్సిపల్ ఛైర్మన్ పీఠాలు ఆశిస్తున్న అభ్యర్థులు ఓటర్లకు భారీ నజరానాలు ఇస్తున్నారు. MNCL కార్పొరేషన్ మొదటి మేయర్ పీఠం కోసం ఓ కాంగ్రెస్ అభ్యర్థి ఓటుకు రూ.5000-రూ.10000 వరకు ఇస్తున్నట్లు తెలుస్తోంది. SKZRలో BRSకి చెందిన ఓ మహిళా అభ్యర్థి ఓటుకు రూ.3వేలు, ASFలోనూ ప్రత్యర్తిపై విజయాన్ని ప్రతిష్ఠగా తీసుకున్న ఓ కాంగ్రెస్ అభ్యర్థి ఓటర్లకు మందు, విందుతో పాటు రూ.3వేలు ముట్ట చెబుతున్నట్లు సమాచారం.
News February 10, 2026
మేక్రాన్ భారత పర్యటన తేదీలు ఖరారు

ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ భారత పర్యటన తేదీలు ఖరారయ్యాయి. ఫిబ్రవరి 17వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఆయన ఇండియాలో పర్యటించి ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నట్లు విదేశాంగ శాఖ ప్రకటించింది. 2047 వరకు ఇరుదేశాలు అనుసరించే వ్యూహాలపై చర్చిస్తారని తెలిపింది.


