News April 27, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News February 16, 2026

మిల్క్ బ్యాంక్ గురించి తెలుసా?

image

మిల్క్ బ్యాంక్ తల్లి పాల దాతల నుండి పాలను సేకరిస్తుంది. ప్రసవానంతర మహిళలు వారి బిడ్డలకు పాలు ఇవ్వగా, మిగిలిన పాలను మిల్క్ బ్యాంక్‌లో డొనేట్ చేస్తారు. ఫార్ములా పాలతో పోల్చి చూస్తే పాశ్చరైజ్డ్ డోనర్ పాల కు పోషక విలువలు ఎక్కువ. ముందుగా పాలల్లో సూక్ష్మ క్రిములు ఉన్నాయేమో చెక్ చేసి తర్వాత పాలను పాశ్చరైజ్ చేసి, నిల్వ చేస్తారు. తల్లిపాలు లభ్యంకాని శిశువులకు డోనర్ పాలను మిల్క్ బ్యాంక్ పంపిణీ చేస్తుంది.

News February 16, 2026

కరీంనగర్ మేయర్ పీఠంపై సందిగ్ధత!

image

కరీంనగర్ నగరపాలక సంస్థలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. మేయర్ పీఠం దక్కించుకునేందుకు బీజేపీకి 34 ఓట్ల బలం ఉండగా, కాంగ్రెస్ కూటమికి 35 ఓట్లు ఉన్నట్లు భావించారు. అయితే, అనూహ్యంగా బీఆర్ఎస్ మద్దతు ఉపసంహరించుకున్నట్లు జరుగుతున్న ప్రచారంతో ఉత్కంఠ నెలకొంది. బీఆర్ఎస్ సహకరించని పక్షంలో మేయర్ పీఠం కమలం వశమయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.

News February 16, 2026

తల్లిపాలు దానం చేయడానికి ఎవరు అర్హులంటే..

image

తల్లిపాలు దానం చేయాలంటే ముందుగా ఆ మహిళకు ఏ రకమైన ఇన్ఫెక్షన్లూ లేవని రక్త పరీక్షల ద్వారా నిర్ధారించాలి. తన బిడ్డకు సంతృప్తికరంగా పాలు తాగించిన తర్వాత, డొనేట్ చేయగలిగినన్ని పాలు కలిగి ఉంటే వాటిని దానం చేయవచ్చు. పొగాకు, డ్రగ్స్, ఆల్కహాల్, ఎక్కువ కెఫీన్ తీసుకొనే అలవాటు ఉన్నవారు తల్లి పాలను దానం చేయడానికి అనర్హులు. HIV, HTLV, హెపటైటిస్ B/ C/ సిఫిలిస్ ఇన్ఫెక్షన్ ఉన్నా బ్రెస్ట్ మిల్క్ డొనేట్ చేయకూడదు.